'పుష్ప 2' జాతర ఇలా సెట్ అయింది..!
సినిమాలో అత్యంత కీలకంగా నిలిచిన జాతర సాంగ్ గురించి తాజాగా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
By: Tupaki Desk | 17 March 2025 1:22 PM ISTఅల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప 2' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హిందీ వర్షన్ దాదాపుగా రూ.1000 కోట్ల వసూళ్లు సాధించగా, ఓవరాల్‌గా ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రూ.1900 కోట్ల వసూళ్లను నమోదు చేసిన విషయం తెల్సిందే. ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా పుష్ప 2 సినిమా నిలిచింది. సినిమా విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన జాతర సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ పాటలో అల్లు అర్జున్ యాక్టింగ్‌కి జాతీయ అవార్డు ఖాయం అంటూ అభిమానులతో పాటు పలువురు సినీ విశ్లేషకులు, విమర్శకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. బన్నీకి రెండవ జాతీయ అవార్డు తెచ్చి పెట్టే విధంగా జాతర సీన్, పాట ఉందని టాక్.
సినిమాలో అత్యంత కీలకంగా నిలిచిన జాతర సాంగ్ గురించి తాజాగా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సుకుమార్ గారు మొదట జాతర సాంగ్‌ను నిమిషం నిడివితో ఉండే విధంగా ట్యూన్ చేయమని చెప్పారు. నిమిషం నిడివితో పవర్ ఫుల్ బీట్‌ను రెడీ చేశాను. అయితే సినిమా షూట్ తర్వాత సీన్ చూసి ఇది సరిపోదు అని అనుకున్నాను. ఆ సమయంలోనే చంద్రబోస్ గారితో కూర్చుని మరోసారి జాతర సాంగ్‌ను రీ ట్యూన్ చేశాము. సుకుమార్ గారు ఆ ట్యూన్ విని షాక్ అయ్యారు. ఫుల్ సాంగ్ ఆయనకు ఎంతో నచ్చింది. దాంతో దానికి తగ్గట్లు షూటింగ్ చేశారు. పాటలో అద్భుతమైన ఎమోషన్స్‌ను కనబర్చుతూ అల్లు అర్జున్ నటించాడు.
సాధారణంగా స్టార్ హీరోలు చీర కట్టుకునేందుకు ఒప్పుకోరు. కానీ అల్లు అర్జున్ జాతర సాంగ్ కోసం చీర కట్టాడు. చీర కట్టులో అల్లు అర్జున్‌ను చూసి చాలా మంది సర్‌ప్రైజ్ అయ్యారు. దానికి తోడు అల్లు అర్జున్ జాతర సాంగ్‌లో అద్భుతమైన ఎమోషన్స్ పలికించే విధంగా మ్యూజిక్ సైతం హెల్ప్ అయింది. మొత్తంగా పుష్ప 2 సినిమాలో జాతర సినిమాలోని ఆ పాటకు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గంగో రేణుకమ్మ తల్లి సాంగ్ విజువల్‌గా అద్భుతంగా రావడంలో అల్లు అర్జున్ అప్పియరెన్స్‌తో పాటు, సుకుమార్ భారీగా ఖర్చు చేసి ప్రత్యేకంగా వేయించిన సెట్, ఔట్ ఫిట్, బ్యాక్ గ్రౌండ్ సెట్టింట్.. ఇలా ప్రతి ఒక్కటి కలిసి వచ్చి పుష్ప 2 సినిమాలో ఆ పాట అద్భుతంగా నిలిచింది.
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తర్వాత సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 సినిమా విడుదలకు ముందే బన్నీ తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో అనే వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను అట్లీ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అయ్యాడు. అందుకు సంబంధించిన వర్క్ జరుగుతుంది. వచ్చే ఏడాదిలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. అట్లీ దర్శకత్వంలో బన్నీ హీరోగా రూపొందబోతున్న సినిమాను భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందించేందుకు గాను ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జాన్వీ కపూర్ ఒక హీరోయిన్‌గా నటించనుండగా మరో ముగ్గురు ముద్దుగుమ్మలు నటించే అవకాశాలు ఉన్నాయి.