Begin typing your search above and press return to search.

పుష్ప 2 ఈవెంట్.. ఈసారి దేవిశ్రీప్రసాద్ ఏమన్నారంటే..

మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప-2.. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Dec 2024 4:08 AM GMT
పుష్ప 2 ఈవెంట్.. ఈసారి దేవిశ్రీప్రసాద్ ఏమన్నారంటే..
X

మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప-2.. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న ఆ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కు కూడా ఆయన వర్క్ చేశారు. ఇప్పుడు సీక్వెల్ తో ఫిదా చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే హైదరాబాద్ లో నిన్న మేకర్స్ నిర్వహించిన వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడగా.. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

పుష్ప-1 కన్నా ఊహకు కూడా అందనంత ఎత్తులో పుష్ప 2 ఉందని తెలిపారు దేవిశ్రీ. ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం ఆనందంగా ఉందని చెప్పారు. తనతోపాటు వర్క్ చేసిన టీమ్ కు కృతజ్ఞతలు తెలిపారు. సౌండ్ ఇంజినీర్స్, కీబోర్డ్ ప్లేయర్స్, వోకల్ సూపర్వైజర్, బ్రదర్ సాగర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆర్టిస్టులు, స్టూడియో స్టాఫ్ అందరికీ థ్యాంక్స్ చెప్పారు.

వాళ్లంతా తనకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. పుష్ప 2 కోసం తన టీమ్ అంతా చాలా కష్టపడిందని చెప్పారు. అందుకే పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. వారందరి కష్టంతోనే తనకు నేషనల్ అవార్డు వచ్చిందని.. అల్లు అర్జున్ కు వచ్చినట్లేనని గుర్తు చేశారు. ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్ గారికి మెనీ మెనీ థ్యాంక్స్ తెలిపారు దేవి శ్రీ ప్రసాద్.

సుకుమార్‌ గారు తమను జాతీయ స్థాయికి.. కాదు కాదు.. ఇంటర్నేషనల్‌ లెవెల్ కు తీసుకెళ్లారని కొనియాడారు. ఆయనెప్పుడూ సినిమాకు దగ్గరగా.. పబ్లిసిటీ దూరంగా ఉంటారని తెలిపారు. ఆయన ఆర్ట్ చాలా పవర్ ఫుల్ అని కొనియాడారు. పబ్లిసిటీ వద్దన్న ఆయన దగ్గరకు వచ్చేస్తుందని అన్నారు. అంత క్రేజ్ ఉందన్నట్లు చెప్పారు.

మైత్రీ రవి గారు, నవీన్ గారు, చెర్రీ గారు తనకు ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వారని చెప్పారు. వాళ్లతోనే ఎక్కువ సినిమాలు చేసినట్లు తెలిపారు. వారికి చాలా ఓపిక అని అన్నారు. అల్లు అరవింద్ గారు చెప్పినట్లు.. మైత్రీ ఒక పెద్ద బ్రాండ్ అని కొనియాడారు. మ్యాజిక్ చేసే లిరిక్స్ అందించిన చంద్రబోస్ తో పాటు మిగతా భాషల్లో సాహిత్యం అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

పుష్పరాజ్, శ్రీవల్లిని ఒకే దగ్గర చూసి చూసి.. రష్మిక వేరే సినిమాల్లో యాక్ట్ చేస్తే కోపం వస్తుందని చెప్పారు. వారిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంటుందని తెలిపారు. కిస్సిక్ అంటూ ఝలక్ ఇచ్చిన శ్రీలీలకు థ్యాంక్స్ చెప్పారు. ఆమె మరింత క్రేజ్ తీసుకొచ్చారని అన్నారు. పీలింగ్స్ సాంగ్ లో వైల్ట్ కెమిస్ట్రీని బన్నీ, రష్మిక చూపించారని అన్నారు. స్క్రీన్ పై అది ఇంకా అదిరిపోతుందని చెప్పారు.

అల్లు అర్జున్ కన్నా అల్లు అరవింద్ గారితో తాను ఎక్కువగా మాట్లాడుతుంటానని తెలిపారు. తన నాన్న ఫీలింగ్స్ ను ఆయనలో చూసుకుంటానని అన్నారు. బన్నీ తన ఫాదర్ ను గర్వ పడేలా చేశారని కొనియాడారు. అల్లు అర్జున్ నుంచి ఫ్రెండ్ షిప్, లవ్ ను తీసుకుంటానని తెలిపారు. తమ మధ్య మంచి రిలేషన్ ఉందని, థ్యాంక్యూ సో మచ్ బన్నీ అంటూ ముగించారు.