ట్రోల్స్ గురించి అస్సలు పట్టించుకోను.. ఇప్పటివరకు నేను కాపీ కొట్టలేదు
రీసెంట్ గా పుష్ప2, తండేల్ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న దేవీ శ్రీ ప్రసాద్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.
By: Tupaki Desk | 15 March 2025 5:26 PM ISTమ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సినిమా అంటే ఒకప్పుడు పక్కా హిట్ అన్నట్టు ఉండేది. సినిమా ఎలా ఉన్నా ఆడియో పరంగా సూపర్ హిట్ అయ్యేది. కానీ గత కొంత కాలంగా దేవీ నుంచి ఒకప్పటి స్థాయి మ్యూజిక్ రావడం లేదనేది నిజం. ఒకప్పుడు తను కంపోజ్ చేసిన ప్రతీ పాటా చార్ట్ బస్టర్ గా నిలిస్తే ఇప్పుడు ఆయన సంగీతం అందించిన ఆల్బమ్ లోని ఏదొక పాట మాత్రమే చార్ట్ బస్టర్ అవుతుంది.
రీసెంట్ గా పుష్ప2, తండేల్ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న దేవీ శ్రీ ప్రసాద్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. తన కెరీర్ మొదలుపెట్టిన టైమ్ లో దేవీ మూవీ తర్వాత సంవత్సరం పాటూ ఖాళీగా ఉన్నట్టు చెప్పిన ఆయన ఇప్పటివరకు తాను ఎప్పుడూ పాటలను కాపీ కొట్టలేదని తెలిపారు.
ఈ మధ్య దేవీ నుంచి ఏ సాంగ్ రిలీజైనా చాలా ఎక్కువగా ట్రోల్స్ వస్తున్నాయి. దేవీ నుంచి సాంగ్ రావడం ఆలస్యం, అది పలానా పాటే అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతూ విమర్శిస్తున్నారు. అయితే ఎవరన్ని విమర్శలు చేసినా తాను పట్టించుకోనని తన కెరీర్లో ఎప్పుడూ పాటలు కాపీ కొట్టలేదని, చాలా మంది తన పాటలను కాపీ కొట్టి మీ సాంగ్స్ చూసి ఇన్‌స్పైర్ అయ్యామని చెప్తుంటారన్నారు.
ఒకవేళ తాను కాపీ కొడితే దర్శక నిర్మాతలు తనకే ఎందుకు ఛాన్సులిస్తారని దేవీ ఈ సందర్భంగా ప్రశ్నించాడు. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోనని చెప్తున్న దేవీ, కెరీర్లో తాను ఎన్నో సక్సెస్‌లు చూశానని, దర్శకులు, నిర్మాతలు, హీరోలకు తనపై మంచి అభిప్రాయం, నమ్మకం ఉన్నాయని దేవీ శ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చారు.
ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు, పాన్ ఇండియా ఛాన్సులన్నీ తమన్ కే వెళ్తున్నాయని, దేవీకి అవకాశాలు తగ్గాయని, తమిళ మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పోటీకి రావడంతో దేవీకి అవకాశాలు తగ్గాయని ఆయన ఫ్యాన్స్ కంగారు పడుతున్న టైమ్ లో దేవీ పుష్ప2, తండేల్ తో హిట్లు కొట్టి తన ఫ్యాన్స్ లో జోష్ ను నింపారు.