డెవిల్ బాక్సాఫీస్.. అమెరికా లెక్కలిలా!
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే
By: Tupaki Desk | 3 Jan 2024 11:05 AM GMTనందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు ఈ సినిమా.. సాలిడ్ వసూళ్లు రాబట్టింది. కల్యాణ్ రామ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా డెవిల్ నిలిచింది.
అయితే అమెరికాలో డెవిల్ మూవీ మంచి వసూళ్లు రాబడుతోంది. కల్యాణ్ రామ్ కెరీర్ లో యూఎస్ లో అత్యధిక గ్రాస్ సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. యూఎస్ లో డెవిల్ మ్యానియా కంటిన్యూ అవుతున్నట్లు తెలిపింది.
ఈ సినిమా విషయంలో ఫస్ట్ రోజు భిన్నమైన అభిప్రాయాలు వచ్చినప్పటికీ.. ఇప్పుడు జనాలకు నెమ్మదిగా ఎక్కుతున్నట్లుగా అనిపిస్తోంది. మెల్లగా వసూళ్లు పెరుగుతున్నాయి. గత శుక్రవారం (డిసెంబర్ 29) రిలీజైన డెవిల్ మూవీ నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.3.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది తొలి రోజు కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.15.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో షేర్ కేవలం రూ.7.5 కోట్లు మాత్రమే.
అయితే రిలీజ్ కు ముందు డెవిల్ ఏకంగా రూ.20 కోట్ల బిజినెస్ చేసింది. ఆ లెక్కన డెవిల్ బ్రేక్ ఈవెన్ సాధించడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. హాలీడే సీజన్ ముగియడంతో కలెక్షన్లు పడిపోయే అవకాశం ఉంది. రెండో వీకెండ్ సమయానికి డెవిల్ అసలు ఎన్ని స్క్రీన్లలో ఉంటుందో కూడా చెప్పలేదు. ఆ తర్వాత వారం సంక్రాంతి సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. దీంతో డెవిల్ కు నిరాశ తప్పేలా లేదు.
భారీ బడ్జెట్ తో ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించడంతోపాటు దర్శకత్వం వహించారు. నిజానికి నవీన్ మేడారం చాలా వరకు కూడా సినిమాను చిత్రీకరించినా.. తర్వాత ప్రొడ్యూసర్ తో విభేదాల కారణంగా తప్పుకున్నారు. 2022లో బిగ్గెస్ట్ మూవీ హిట్ గా నిలిచిన బింబిసార తర్వాత కల్యాణ్ రామ్ నటించిన అమిగోస్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు డెవిల్ తో మళ్లీ గాడిలో పడాలనుకున్న కల్యాణ్ రామ్ ఆశలు తీరేలా లేవు.