Begin typing your search above and press return to search.

వాళ్లకి పుష్ప 2తో ఆన్సర్ ఇచ్చేందుకు రెడీ..!

అలా అని చెప్పి అది మ్యూజిక్ డైరెక్టర్ మీద తోసేయడం కచ్చితంగా తప్పే అవుతుంది.

By:  Tupaki Desk   |   19 Nov 2024 5:30 PM GMT
వాళ్లకి పుష్ప 2తో ఆన్సర్ ఇచ్చేందుకు రెడీ..!
X

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఒకటి రెండు సినిమాలకు సరైన కంపోజింగ్ అది ఆడియన్స్ దృష్టిలో పడనంత మాత్రాన ఆయన ఫెయిల్ అయినట్టు కాదు. దేవి సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన కంగువ త్వరలో రాబోతున్న పుష్ప 2 ఇలా ప్రతి సినిమాకు తన బెస్ట్ మ్యూజిక్ ఇచ్చేందుకు దేవి శ్రీ ప్రసాద్ కృషి చేస్తాడు.. చేస్తూనే ఉన్నాడు. ఐతే కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో వర్క్ అవుట్ అవ్వవు. అలా అని చెప్పి అది మ్యూజిక్ డైరెక్టర్ మీద తోసేయడం కచ్చితంగా తప్పే అవుతుంది.

మణిశర్మ, కీరవాణి మంచి ఫాం లో ఉన్నప్పుడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా తన సాంగ్స్, బిజిఎం తో అదరగొట్టిన దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు ఆడియన్స్ నుంచి వస్తున్న నెగిటివిటీ చూసి షాక్ అవుతున్నాడు. ముఖ్యంగా తమిళ ఆడియన్స్ కంగువ రిలీజ్ టైం లో డిఎస్పి మ్యూజిక్ మీద అసంతృప్తిని వెల్లగక్కారు. నిజానికి కంగువకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగానే ఇచ్చాడు. కానీ సినిమా స్క్రీన్ ప్లే వల్ల అది కాస్త క్లంసీగా అనిపించింది.

ఐతే దేవి శ్రీ ప్రసాద్ తన మీద పడ్డ ప్రతి కామెంట్ కి ఆన్సర్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. అది కూడా నెక్స్ట్ రాబోతున్న పుష్ప 2 తో ఆ సమాధానం రాబోతుంది. పుష్ప 1 సినిమాకు ఇచ్చిన దాని కన్నా మరింత డిఫరెంట్ గా పుష్ప 2 మ్యూజిక్ కంపోజ్ చేశారట దేవి శ్రీ. తన మీద నోరు పారేసుకున్న ప్రతి ఒక్కరు మళ్లీ దేవి శ్రీ ప్రసాద్ సూపర్ అని అనుకునేలా ప్లాన్ చేస్తున్నాడు.

పుష్ప 1 కు ఎలా అయితే దేవి శ్రీ మ్యూజిక్ హైలెట్ గా అయ్యిందో.. పుష్ప 2 కి కూడా అదే తరహా మ్యూజిక్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. పుష్ప 2 లో సాంగ్స్ మాత్రమే కాదు బిజిఎం కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన పుష్ప 2 ట్రైలర్ లో దేవి మ్యూజిక్ కూడా అదిరిపోయింది. కచ్చితంగా సినిమాతో దేవి మరోసారి తన మ్యూజిక్ స్టామినా ప్రూవ్ చేస్తాడని నమ్ముతున్నారు.

డిఎస్పీ ఈమధ్య సినిమాల సంఖ్య తగ్గించడం కూడా అతను వెనుకపడటానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఇదివరకు వరుసగా సినిమాలు చేసేది దేవి శ్రీ ఈమధ్య సెలెక్టెడ్ గా సినిమాలు చేయడం అవి కూడా ఆశించిన స్థాయి అవుట్ పుట్ రాకపోవడం ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేస్తుంది. మరి పుష్ప 2 తో దేవి మళ్లీ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.