Begin typing your search above and press return to search.

దేవి శ్రీ ప్రసాద్.. మళ్ళీ అదే మాట!

సౌత్ ఇండియాలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు దేవిశ్రీ ప్రసాద్

By:  Tupaki Desk   |   20 March 2024 5:14 AM GMT
దేవి శ్రీ ప్రసాద్.. మళ్ళీ అదే మాట!
X

సౌత్ ఇండియాలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు దేవిశ్రీ ప్రసాద్. పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న ఈ టాలెంటెడ్ కంపోజర్ ఇప్పుడు భారీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. డిఎస్పీ చేస్తోన్న సినిమాలలో ఒక్క ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప మిగిలినవన్నీ పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. పుష్ప 2 మూవీ లైన్ లో ఉండగా సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కంగువ రిలీజ్ కి సిద్ధం అవుతోంది.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ - కంగువ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఒకేసారి రావడంతో దేవిశ్రీప్రసాద్ పేరు ట్రేండింగ్ లోకి వచ్చింది. కంగువ టీజర్ ని పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది. కంప్లీట్ పీరియాడిక్ జోనర్ లో ఫిక్షనల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ రాబోతోంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఆదిమ తెగల మధ్య ఆధిపత్య పోరుగా కంగువ మూవీ ఉండబోతోందని టీజర్ బట్టి తెలుస్తోంది.

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాలకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తూ ఉండటంతో ప్రత్యేకత ఏర్పడింది. కంగువా 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ. ఇక ఉస్తాద్ ప్యూర్ కమర్షియల్ జోనర్ లో పవర్ స్టార్ ఇమేజ్ బిల్డ్ చేసే యాక్షన్ మూవీగా రాబోతోంది.

అయితే ఈ సినిమాల గ్లింప్స్ కు సంబంధించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పరంగా దేవి శ్రీ ప్రసాద్ అంత ఇంపాక్ట్ చూపించలేకపోయాడు అనే మాట వినిపిస్తోంది. పుష్ప సినిమా తర్వాత దేవిశ్రీ ప్రసాద్ నుంచి ఆడియన్స్ కి ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా దేవి కాస్తా వీక్ అనే టాక్ ఉండేది అయితే రంగస్థలం, పుష్ప సినిమాలతో వాటికి ఫుల్ స్టాప్ పెట్టాడు.

అయితే సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్స్ మాత్రం దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలకి తన బెస్ట్ అవుట్ పుట్ అందించాడని అంటున్నారు. అయితే ఆడియన్స్ ఎక్కువగా ఎక్స్ పెక్ట్ చేయడానికి ఆ అంచనాలు పూర్తిస్థాయిలో దేవిశ్రీ ప్రసాద్ అందుకోలేకపోయాడనే టాక్ నడుస్తోంది. అయితే టీజర్ కి, గ్లింప్స్ కి ఇచ్చిన మ్యూజిక్ కి సినిమా మొత్తం ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కి డిఫరెన్స్ ఉంటుందని, వీటిని చూసి ఒక అంచనాకు రాకూడదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక సుకుమార్ సినిమాలకు మాత్రమే దేవి సరైన అవుట్ ఫుట్ ఇస్తాడానేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. సుకుమార్, దేవి లేకుండా ఇప్పటివరకు ఒక్క సినిమా చేయలేదు. రాజమౌళి - కీరవాణి ఆ తరువాత సుకుమార్ - దేవిశ్రీప్రసాద్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇవే బెస్ట్ కాంబినేషన్స్ అని చెప్పవచ్చు. అయితే దేవి ఈసారి డిఫరెంట్ సినిమాలను లైన్ లో పెట్టాడు కాబట్టి ఈ మిత్ ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది.