Begin typing your search above and press return to search.

దేవి లిస్టులో మరో హిట్ కాంబో

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   19 July 2024 2:30 PM GMT
దేవి లిస్టులో మరో హిట్ కాంబో
X

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. పుష్ప ది రూల్, కంగువ సినిమాలు దేవిశ్రీ ప్రసాద్ లైన్ అప్ లో ఉన్నాయి. ఈ రెండు సినిమాలు రాక్ స్టార్ ఇమేజ్ నెక్స్ట్ లెవల్ లోకి తీసుకొని వెళ్లనున్నాయి. మరికొన్ని సినిమాలు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నేచురల్ స్టార్ నానితో దేవిశ్రీ ప్రసాద్ ‘ఎంసిఏ’ మూవీ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ రాలేదు. చాలా ఏళ్ళ తర్వాత నాని సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించబోతున్నాడంట. నేచురల్ స్టార్ నాని తన 33వ సినిమాని శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో చేస్తున్నారు. ‘దసరా’ సినిమాతో ఇప్పటికే శ్రీకాంత్ ఓదేల నానికి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అలాగే నాని కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ని ‘దసరా’ మూవీతోనే సొంతం చేసుకున్నాడు.

దీంతో శ్రీకాంత్ మరో ఇంటరెస్టింగ్ మాస్ కథతో నానికి చెప్పి ఒకే చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని కూడా ‘దసరా’ మూవీని ప్రొడ్యూస్ చేసిన సుధాకర్ చెరుకూరి నిర్మించబోతున్నాడు. నాని కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ హైదరాబాద్ ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందంట. నాని క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని అనుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. మేగ్జిమమ్ ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందంట.

నాని 33వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలో మూవీకి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందంట. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ సినిమాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేశారు. ఈ మూవీ ఆగష్టు నెల ఆఖరులో రిలీజ్ కానుంది.

వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న నాని ‘సరిపోదా శనివారం’ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకోవాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చి అందరికి కనెక్ట్ అయ్యింది. సాంగ్స్ కూడా బాగున్నాయని టాక్ సొంతం చేసుకున్నాయి. సరిపోదా శనివారం మూవీ రిలీజ్ తర్వాత శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో చేయబోయే సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే అవకాశం ఉందంట.