2023 వరల్డ్ కప్‌లో దేవీశ్రీ బాణీల సందడి!
ఈ పాటలో నాయకానాయికల ఆహార్యం ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా దేవీశ్రీ ప్రసాద్ బాణీ ఎంతగానో ఆకట్టుకుంది.
By: Tupaki Desk | 16 Nov 2023 4:15 AM GMTఈసారి వరల్డ్ కప్ మ్యాచ్‌లలో టీమిండియా సంచలనాలు నమోదు చేస్తోంది. ఎదుట ఉన్నది ఎలాంటి టీమ్ అయినా వన్ సైడ్ గేమ్ ఆడేస్తోంది. భారీ టార్గెట్లు పెడుతోంది. భారీ లక్ష్యాలను సునాయాసంగా ఛేధిస్తోంది. చివరికి నిన్నటి రోజున నువ్వా నేనా? అంటూ హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై అద్భుత విజయం సాధించింది. తుదికంటా ఉత్కంఠగా సాగిన పోరులో భారత్ గ్రేట్ కంబ్యాక్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఇదిలా ఉంటే ఈసారి వరల్డ్ కప్ 2023 ఆద్యంతం రెండు తెలుగు పాటలు ఉర్రూతలూగించాయి. ఆడిటోరియంలోని ఆడియెన్స్ గ్యాలరీలో సందడి చేస్తున్న వారిలో కొన్ని బ్యాండ్ లు అదే పనిగా మోత మోగిస్తున్నాయి. డ్రమ్స్ వాయిస్తూ బోలెడంత సందడి వాతావరణం నెలకొంటోంది. ప్రపంచకప్ మ్యాచ్ లలో సెమీఫైనల్స్ లో హిందీ పాటలతో డీజేలు వినిపించినా కానీ, గత మ్యాచ్ లలో మాత్రం తెలుగు సినిమా పాటలు ఊ అంటావా ఊఊ అంటావా? .. సామీ సామీ .. బాగానే మోగాయి. ఇవి రెండూ పుష్ప సినిమాలోని పాటలు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -రష్మిక మందన జంటగా నటించిన పుష్ప చిత్రం నుంచి సామీ సామీ పాట ఎంత పెద్ద చార్ట్ బస్టరో తెలిసిందే. ఈ పాటలో నాయకానాయికల ఆహార్యం ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా దేవీశ్రీ ప్రసాద్ బాణీ ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక ఇదే సినిమా నుంచి ఊ అంటావా పాట అప్పట్లో ఒక ఊపు ఊపింది. మళ్లీ వరల్డ్ కప్ లోను ఇది మోగింది. దేవీశ్రీ రాకింగ్ మ్యూజిక్ కి తగ్గట్టుగా, సమంత స్టెప్పులు పెద్ద తెరపై ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇదే ట్యూన్ పలుమార్లు వరల్డ్ కప్ లీగ్ దశ మ్యాచ్ లలో వినిపించింది. టీమిండియా ఆటగాళ్లు బౌండరీలు తరలిస్తుంటే గత మ్యాచ్ లలో 'ఊ అంటావా..' గీతాన్ని డీజేగా వినిపించిన సందర్భాలున్నాయి. అయితే సెమీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఇటీవల విజయం సాధించిన హిందీ సినిమాల ట్యూన్లు వినిపించాయి. ఈసారి ప్రపంచకప్ మ్యాచ్ లలో కామెంట్రీ కూడా ఎంతో వినోదాత్మకంగా మారింది. రొటీన్ కి భిన్నంగా హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లేదా రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో ఉండే హుషారు క్రికెట్ లో కూడా ప్రవేశించింది. కామెంటేటర్లు ఆడియెన్ లో కరతాళ ధ్వనులు మోగేంతగా హుషారెత్తించారు. ప్రపంచ కప్ 2023 ఫైనల్ ఘట్టాన్ని ఆస్వాధించేందుకు సిద్ధంగా ఉన్న ప్రపంచవ్యాప్త ఆడియెన్ కి భారతీయ సంగీతంలో మజా ఏంటో తెలిసొస్తుందేమో!