పిక్‌టాక్ : బెడ్‌పై అందంగా టైగర్ బ్యూటీ
'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్‌లో నటించిన దేవియాని శర్మ ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By: Tupaki Desk | 21 March 2025 6:00 AM IST'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్‌లో నటించిన దేవియాని శర్మ ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేసిన సినిమాలు తక్కువే అయినా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అందమైన ఫోటోలను షేర్ చేయడంతో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్‌కి ఏమాత్రం తగ్గకుండా అందంగా కనిపించే దేవియాని శర్మ సోషల్ మీడియాలో మరోసారి తన అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఎంతో మంది ముద్దుగుమ్మలు సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ కెరీర్‌లో దూసుకు పోతున్నారు. కానీ ఈ అమ్మడు మాత్రం సేవ్ ది టైగర్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించినప్పటికీ అదృష్టం కలిసి రావడం లేదు.
మెయిన్ హీరోయిన్‌గా అవకాశాలు రాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసేందుకు దేవియాని శర్మ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. మరోసారి దేవియాని షేర్ చేసిన ఫోటోల కారణంగా నెట్టింట ఆమె గురించి చర్చ జరుగుతోంది. ఇంత అందంగా ఉన్న దేవియాని శర్మ ఇన్నాళ్లు ఎక్కడ పోయింది అంటూ కొందరు కామెంట్ చేస్తే, ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది హీరోయిన్స్‌తో పోల్చితే దేవియాని శర్మ మరింత అందంగా ఉందని, భవిష్యత్తులో అయినా ఈమెకు ఇండస్ట్రీలో గుర్తింపు దక్కాలని, ఈ అందంకు తగ్గ ఆఫర్లు దక్కాల్సిందే అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు.
సేవ్ ది టైగర్స్ సినిమాలో పద్దతి అయిన శ్రీమతి పాత్రలో నటించిన దేవియాని శర్మ సోషల్ మీడియాలో మాత్రం ఒక అడుగు ముందుకు వేసి ఒకింత వేడి ఎక్కించే విధంగా పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. వెబ్ సిరీస్‌ల్లో బోల్డ్ పాత్రలకు ఈమె సరిగ్గా సెట్ అవుతుంది అని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఈమెకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇలాంటి ఫోటోలతో మళ్లీ మళ్లీ సోషల్ మీడియా ద్వారా వైరల్ అయితే కచ్చితంగా రాబోయే ఏడాది కాలంలో ఈమెకు పెద్ద ప్రాజెక్ట్‌ల్లో ఆఫర్ దక్కవచ్చు అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. దేవియాని శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో హీట్ పెంచే విధంగా తెగ హడావిడి చేస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈమె షేర్ చేసే ఫోటోలు కనీసం చూపు తిప్పనివ్వడం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈమె చూపించే అందం సినిమాల్లో లేదా వెబ్ సిరీస్‌లో చూపిస్తే కచ్చితంగా ఓ రేంజ్‌లో స్పందన దక్కే అవకాశాలు ఉన్నాయి. తద్వారా సినిమాకు లేదా వెబ్ సిరీస్‌కి మంచి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె ఒక సినిమాలో నటించడంతో పాటు, వెబ్ సిరీస్‌కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఒక్క సూపర్ హిట్ పడితే కచ్చితంగా టాలీవుడ్‌లో పదేళ్ల పాటు కొనసాగే అంతటి అందం ఈమెది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈమె నటించేందుకు ప్రయత్నాలు చేస్తే మంచిది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.