Begin typing your search above and press return to search.

మినీ డ్రెస్సులో దేవియాని.. వ్వాటే లుక్!

వెబ్ సిరీస్‌లతోనే కాకుండా సినిమాల్లోనూ సక్సెస్‌ను సాధించేందుకు దేవియాని శర్మ ప్రయత్నాలు చేస్తోంది.

By:  Tupaki Desk   |   28 Oct 2024 12:30 AM GMT
మినీ డ్రెస్సులో దేవియాని.. వ్వాటే లుక్!
X

దేవియాని శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపిస్తోంది. తన కెరీర్‌ను వెబ్ సిరీస్‌ల ద్వారా ప్రారంభించిన దేవియాని, తొలి అడుగులనే ఆసక్తికరమైన పాత్రలతో ప్రేక్షకుల మదిని గెలుచుకుంది. తెలుగు వెబ్ సిరీస్ 'అనగనగా'లో చేసిన పాత్రతో తన ప్రతిభను నిరూపించుకుని, తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత 'ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్' అనే వెబ్ సిరీస్‌తోనూ అలరించింది.


వెబ్ సిరీస్‌లతోనే కాకుండా సినిమాల్లోనూ సక్సెస్‌ను సాధించేందుకు దేవియాని శర్మ ప్రయత్నాలు చేస్తోంది. ‘సైతాన్’ వెబ్ సిరీస్‌లో వైలెంట్ రోల్‌తో పాటు, 'సేవ్ ది టైగర్స్'లో మోడ్రన్ హౌస్ వైఫ్ పాత్రలో తన నటనతో విభిన్న కేరెక్టరైజేషన్‌ను చూపించింది. ఇవి దేవియాని శర్మకు తాను ఎలాంటి పాత్రను అయినా సరే నెరవేర్చగల దిశగా ఉన్నటువంటి గుర్తింపును తెచ్చాయి. ఈ రెండు సిరీస్‌లు తెలుగు ప్రేక్షకులలో ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అందించాయి.


ఇప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోషూట్లతోను అభిమానులను ఆకర్షిస్తోంది. తాజాగా పింక్ కలర్ మినీ డ్రెస్సులో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన దేవియాని అందంతో పాటు అభినయంతో కూడా టాలీవుడ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. చక్కటి కళ్లతో, స్టైలిష్ లుక్స్‌తో దేవియాని అభిమానులను మరింతగా ఆకట్టుకుంటోంది.

ఈ ఫోటోలలో ఆమె తన అందాన్ని హైలెట్ చేస్తూ, తన బోల్డ్ స్టైల్‌ను ఫ్యాన్స్‌కు చూపించింది. సోషల్ మీడియా ద్వారా తమ ఫాలోవర్స్‌తో నిత్యం కనెక్ట్ అవుతూ, తన తాజా ఫోటోలతో వారిని అలరిస్తుంది. కమర్షియల్ హిరోయిన్‌గా తన స్థానాన్ని స్థిరపరచుకోవాలనే లక్ష్యంతో ఉన్న దేవియాని శర్మ, సిల్వర్ స్క్రీన్‌పై పెద్ద స్థాయిలో విజయాన్ని అందుకోవాలని కోరుకుంటోంది. మరి ఆమెకు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.