నల్లని బికినీలో దేవియాని శర్మ.. స్టన్నింగ్ గ్లామర్ డోస్!
రీసెంట్గా దేవియాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన బ్లాక్ అవుట్‌ఫిట్ ఫోటోలు వైరల్‌గా మారాయి.
By: Tupaki Desk | 29 Nov 2024 2:42 PM GMTతెలుగు ప్రేక్షకులకు రీసెంట్గా పరిచయం అయిన నటి దేవియాని శర్మ, గ్లామర్ ప్రపంచంలో తనదైన ప్రత్యేకతను చూపిస్తోంది. సౌందర్యానికి మోడ్రన్ టచ్ కలిపి ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ వస్తోంది. రీసెంట్గా దేవియాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన బ్లాక్ అవుట్‌ఫిట్ ఫోటోలు వైరల్‌గా మారాయి. ప్రకృతి అందాల మధ్య ఆమె ఆకర్షణీయమైన లుక్ అభిమానులను కట్టిపడేసింది.
ప్రతిఒక్కరూ ప్రత్యేకంగా ఉండాలి అనే క్యాప్షన్ తో తన లైఫ్ స్టైల్ ను హైలెట్ చేసింది. దేవియాని శర్మ మొదట్లో ఫ్యాషన్ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. కెమెరా ముందు ఉన్న స్టైల్, కాన్ఫిడెన్స్ ఆమెకు మంచి పేరు తెచ్చాయి. తరువాత వెబ్ సిరీస్‌ల ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన దేవియాని, తెలుగు ఇండస్ట్రీలోనూ అవకాశాలను సొంతం చేసుకుంటోంది.
"అనగనగా" వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన దేవియాని, "సైతాన్," "సేవ్ ద టైగర్స్" లాంటి సిరీస్‌లలో తన పాత్రలతో ఆకట్టుకుంది. తొలి వెబ్ సిరీస్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమ్మడు, తెలుగులో కొన్ని చిన్న సినిమాలు కూడా చేసింది. నటనలో ఉన్న తన ప్రావీణ్యం, పాత్రల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ ఆమెను మరింత హైలైట్ చేసింది. ప్రస్తుతం దేవియాని కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టి బిజీగా కొనసాగుతోంది. "లైఫ్ స్టోరీస్" అనే కొత్త వెబ్ సిరీస్‌లో ఆమె ప్రధాన పాత్రలో నటించనుంది.
దేవియాని సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిత్వం, గ్లామర్‌ను హైలెట్ చేస్తూ, నెటిజన్లను ఆకర్షిస్తోంది. తాజా ఫోటోషూట్‌లో ఆమె కేవలం సౌందర్యమే కాకుండా, క్యూట్ లుక్స్ తో కూడా ఆకట్టుకుంది. ప్రకృతి మధ్య ఆమె క్లాసీ లుక్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రత్యేకంగా బ్లాక్ అవుట్‌ఫిట్‌లో ఆమె పోజు అమేజింగ్ గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.