Begin typing your search above and press return to search.

దేవియాని శర్మ.. బికినీలో బ్లాస్టింగ్ గ్లామర్

గ్లామర్ బ్యూటీస్ కి సోషల్ మీడియాలో కేరాఫ్ అడ్రెస్ అంటే ఇన్ స్టాగ్రామ్ అని చెప్పాలి.

By:  Tupaki Desk   |   1 July 2024 5:55 AM GMT
దేవియాని శర్మ.. బికినీలో బ్లాస్టింగ్ గ్లామర్
X

గ్లామర్ బ్యూటీస్ కి సోషల్ మీడియాలో కేరాఫ్ అడ్రెస్ అంటే ఇన్ స్టాగ్రామ్ అని చెప్పాలి. ఒకప్పుడు అవకాశాల కోసం క్యాస్టింగ్ ఏజెంట్ లకి ఫోటోలు ఇచ్చి, మోడల్ కో-ఆర్డినేటర్లుతో ఫాలో అప్ చేయించుకునేవారు. అయితే బ్యూటీస్ కి ఇప్పుడు అంత అవసరం ఉండటం లేదని చెప్పొచ్చు. దర్శక, నిర్మాతలు కూడా నేరుగా ఇన్ స్టాగ్రామ్ లో అందాల భామల ప్రొఫైల్స్ చూసి తమ సినిమాలు, వెబ్ సిరీస్ లలో హీరోయిన్స్ గా సెలక్ట్ చేసుకుంటున్నారు.


నార్త్ ఇండియన్ బ్యూటీస్ కి సౌత్ లో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. సైతాన్, సేవ్ ది టైగెర్స్ వెబ్ సిరీస్ ల ద్వారా పాపులర్ అయిన నార్త్ ఇండియన్ బ్యూటీ దేవియాని శర్మ. ఈ అమ్మడు సైతాన్ లో చేసిన భయంకరమైన పెర్ఫార్మెన్స్ ని ఎవరు కూడా మర్చిపోరు. అలాగే సేవ్ ది టైగెర్స్ లో కార్పొరేట్ విమెన్ గా అదే స్థాయిలో ఆటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్ లో నటించి మెప్పించింది.

మహి వి రాఘవ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ లతో దేవియాని శర్మకి టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది. రొమాంటిక్ మూవీతో ఈ బ్యూటీ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తరువాత సినిమాలలో పెద్దగా అవకాశాలు రాకపోయిన వెబ్ సిరీస్ లలో మాత్రం ఛాన్స్ లు అందుకుంది. అనగనగా అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.

అయితే దేవియాని శర్మకి బాగా పేరు తీసుకొచ్చింది మాత్రం సైతాన్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ హాట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన హాట్ అండ్ గ్లామరస్ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ లో బ్లాక్ కలర్ సింగిల్ పీస్ బికినీలో అదిరిపోయే ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటో కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది.

దేవయాని శర్మ బికినీలో అదిరిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ బ్యూటీ గ్లామర్ కు తగ్గట్టుగా మంచి ఆఫర్స్ వస్తే టాలీవుడ్ లో గ్లామర్ క్వీన్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఈ బ్యూటీ ఎంత బోల్డ్ గా ఉందో పెర్ఫార్మెన్స్ కూడా అంతే బోల్డ్ గా ఉంటుందని సైతాన్ వెబ్ సిరీస్ చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. అంజలి ఝాన్సీ వెబ్ సిరీస్ లో కూడా దేవియాని శర్మ కీలక పాత్రలో కనిపించింది.