Begin typing your search above and press return to search.

'సేవ్ ది టైగర్స్' బ్యూటీ.. థైస్ షో ఓవర్ లోడెడ్!

ఇటీవల సేవ్ ది టైగర్స్, సైతాన్ వెబ్ సిరీసులతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.

By:  Tupaki Desk   |   3 April 2024 5:38 AM GMT
సేవ్ ది టైగర్స్ బ్యూటీ.. థైస్ షో ఓవర్ లోడెడ్!
X

దేవియాని శర్మ.. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి పేరు దక్కించుకుని దూసుకుపోతోంది. నవీన్‌ చంద్ర నటించిన భానుమతి రామకృష్ణ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాలో హీరో ఫ్రెండ్ గా కనిపించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఇటీవల సేవ్ ది టైగర్స్, సైతాన్ వెబ్ సిరీసులతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.


డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సేవ్ ది టైగర్స్ తో చాలా మందికి దగ్గరైంది దేవియాని. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం నాలుగేళ్లుగా హానెస్ట్‌ గా హార్డ్ వర్క్ చేస్తోందని ఆమె ప్రొఫైల్ ను చూస్తే అర్థమవుతుంది. ఇక సైతాన్ వెబ్ సిరీస్ లో రఫ్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ చేసింది. జీవితంలో తాను ఎంచుకున్న మార్గానికి అడ్డం వచ్చిన వారిని చంపేందుకు కూడా వెనుకాడని జయప్రద రోల్ లో నటించి అదరగొట్టింది.

ఇప్పుడు పెద్ద హీరోల చిత్రాల్లో అవకాశాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది దేవియాని శర్మ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కమర్షియల్‌ హీరోయిన్‌ కావాలన్నదే తన లక్ష్యం కాదని తెలిపింది. మంచి స్కోప్ ఉన్న రోల్స్ లో నటించాలన్నదే తన కలగా చెప్పింది. కోలీవుడ్ లో అడుగు పెట్టాలనుకుంటున్నట్లు కూడా వెల్లడించింది. అయితే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటోంది. రకరకాల ఫొటోలతో అభిమానులను అలరిస్తోంది.

తాజాగా పొట్టి వైట్ కలర్ గౌనులో అందాలు ఆరబోసింది దేవియాని. అద్దం ముందు నిల్చుని ఓర చూపులతో ఫ్లాట్ చేసేస్తోంది. థైస్ షోతో కుర్రాళ్ల మతులు పోగుడుతోంది. తన పోజుతోనే హీట్ పుట్టిస్తోంది. స్కిన్ షో కోసం క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ క్యాప్షన్ ఆలోచింపజేసేలా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఏదైనా దేవియాని గ్లామర్ షో అదిరిపోయిందని నెట్టింట సందడి చేస్తున్నారు.

బాహుబలి మూవీ తర్వాత తెలుగు సినిమాలకు ఢిల్లీ ప్రజలు ఫిదా అవుతున్నారట. అందుకే దేవియాని కూడా టాలీవుడ్ లోకి వచ్చేసిందట. ఈ విషయాన్ని ఆమెనే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. దేవియాని మంచి చిత్రకారిణి కూడా. ఖాళీ సమయాల్లో పెయింటింగ్స్ వేస్తుంటుంది. అందుకోసం స్పెషల్ ఇన్ స్టా అకౌంట్ కూడా యూజ్ చేస్తోంది. మరి ఫ్యూచర్ లో ఈ అమ్మడు ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.