Begin typing your search above and press return to search.

దేవియాని శర్మ గ్లామర్ బ్లాస్ట్

పర్పుల్ కలర్ ఔట్ ఫిట్ లో సందడి చేస్తోంది దేవియాని శర్మ. హెయిర్ లీవ్ చేసి మాయ చేస్తోంది. తన నవ్వుతోనే ఫ్లాట్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   15 July 2024 4:32 PM GMT
దేవియాని శర్మ గ్లామర్ బ్లాస్ట్
X

నటి దేవియాని శర్మకు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ.. నవీన్ చంద్ర నటించిన భానుమతి రామకృష్ణ మూవీతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా.. అమ్మడు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత క్రమంగా వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. రొమాంటిక్ మూవీలో యాక్ట్ చేసి తనదైన శైలిలో మెప్పించింది.

ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా వచ్చిన ఆ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించింది దేవియాని శర్మ. ఆ తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ ఓటీటీలో వచ్చిన సైతాన్‌, సేవ్‌ ద టైగర్స్ వెబ్ సిరీసులతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. సేవ్ ద టైగర్స్ సిరీస్ లో హై ప్రొఫైల్ ఫెమినిస్ట్ లాయర్ గా నటించి ఆకట్టుకుంది అమ్మడు. సైతాన్ వెబ్ సిరీస్ లో రఫ్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ లో ఓ రేంజ్ లో నటించింది. తన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియా చూస్తే షేక్ అవ్వాల్సిందే. ఎప్పటికప్పుడు అందాల ఆరబోతతో అదరగొడుతోంది. మత్తెక్కించే ఫోజులతో పిక్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. డైలీ తన వాల్ చూడాలనిపించేలా ట్రీట్స్ ఇస్తుంటోంది. స్కిన్ షోతో క్లీన్ బౌల్డ్ చేస్తుంటోంది. నెట్టింట ఆమె పిక్స్ ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి. తాజాగా మరోసారి అదిరిపోయే గ్లామర్ ట్రీట్ ఇచ్చింది దేవియాని శర్మ.

పర్పుల్ కలర్ ఔట్ ఫిట్ లో సందడి చేస్తోంది దేవియాని శర్మ. హెయిర్ లీవ్ చేసి మాయ చేస్తోంది. తన నవ్వుతోనే ఫ్లాట్ చేస్తోంది. తేనె కళ్లతో మైండ్ బ్లాక్ చేస్తోంది. నడుము మడతలతో కిర్రెక్కిస్తోంది. ఎద అందాలతో కవ్విస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో పెట్టిన సాంగ్ తో ట్రాన్స్ లోకి తీసుకెళ్తోంది. ఓవరాల్ గా నెటిజన్ల చూపును తన వైపు తిప్పుకుంటోంది. ప్రస్తుతం దేవియాని శర్మ పిక్స్ నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి.

దేవియాని శర్మ పిక్స్ కు లైకుల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. హీట్ పుట్టిస్తున్నావ్ అమ్మడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అందానికి దాసోహమయ్యామంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆ తేనె కళ్లకు సింపుల్ గా ఫ్లాట్ అయ్యామని అంటున్నారు. గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ దేవియాని అంటూ సందడి చేస్తున్నారు. అలా బ్యూటీని పొగుడుతూ ఆకాశానికెత్తేస్తున్నారు.