Begin typing your search above and press return to search.

దేవ‌ర గ్లింప్స్ ఎప్పుడొస్తుందో లీకిచ్చిన క‌ళ్యాణ్ రామ్

బ్యాక్ టు బ్యాక్ ప్ర‌యోగాలతో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఎప్పుడూ చ‌ర్చ‌ల్లో నిలుస్తుంటారు.

By:  Tupaki Desk   |   26 Dec 2023 9:31 AM GMT
దేవ‌ర గ్లింప్స్ ఎప్పుడొస్తుందో లీకిచ్చిన క‌ళ్యాణ్ రామ్
X

బ్యాక్ టు బ్యాక్ ప్ర‌యోగాలతో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఎప్పుడూ చ‌ర్చ‌ల్లో నిలుస్తుంటారు. అత‌డు న‌టిస్తున్న తాజా చిత్రం `డెవిల్`. 29 డిసెంబర్ 2023న ఘ‌నంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. నిర్మాత అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం పోస్ట‌ర్ ద‌శ‌నుంచి ఆస‌క్తిని పెంచింది. డెవిల్ ట్రైల‌ర్ ఉత్కంఠ‌ను పెంచింది. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటించింది.

విడుదలకు స‌మ‌యం దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర‌బృందం ప్రచారంలో వేగం పెంచింది. చిత్ర‌క‌థానాయ‌కుడు కళ్యాణ్ రామ్ ఇటీవల మీడియాతో ముచ్చటించారు. ఇంటర్వ్యూలో డెవిల్ సంగ‌తుల‌తో పాటు, ఎన్టీఆర్ న‌టిస్తున్న‌ దేవర-పార్ట్ 1 గురించి చిత్ర‌ నిర్మాత‌ల్లో ఒక‌రైన‌ క‌ళ్యాణ్ రామ్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను షేర్ చేసారు.

దేవ‌ర‌లో జూ.ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తుండ‌గా కొర‌టాల శివ అత్యంత భారీ కాన్వాసుతో తెర‌కెక్కిస్తున్నారు. దేవ‌ర‌ దాదాపు 80శాతం షూటింగ్ పూర్తయిందని క‌ళ్యాణ్ రామ్ వెల్లడించారు. ప్ర‌స్తుతం దేవ‌ర‌ బృందం VFX ప‌నులు పూర్తి చేస్తోంది. వంద‌శాతం ఔట్ పుట్ తో సంతృప్తి చెందిన తర్వాత దేవర గ్లింప్స్ విడుదల తేదీని వెల్లడిస్తార‌ని క‌ళ్యాణ్ రామ్ తెలిపారు.

దేవర చిత్రంలో బాలీవుడ్ యువ‌క‌థానాయిక‌ జాన్వీ కపూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. జాన్వీకి ఇది తెలుగులో తొలి సినిమా. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించారు. ఆదిపురుష్ లో రావణ్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించిన సైఫ్ ఇప్పుడు మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను స్ట‌న్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. ఇందులో ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ త‌దితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అనిరుధ్ దేవ‌ర కోసం యూనిక్ గా ఉండే బీజీఎంని రూపొందిస్తున్నార‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ - యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవ‌రకు సీక్వెల్ కూడా ఉంటుంద‌ని వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.