Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో టైగర్‌ బ్యూటీ మెరుపులు

ఇటీవల తెలుగు ప్రేక్షకులకు సేవ్ ది టైగర్స్‌ వెబ్‌ సిరీస్‌ తో పరిచయం అయిన ముద్దుగుమ్మ దేవియాని శర్మ.

By:  Tupaki Desk   |   23 Sep 2024 7:12 AM GMT
పిక్‌టాక్‌ : బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో టైగర్‌ బ్యూటీ మెరుపులు
X

సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే అందమైన ఫోటోల కారణంగా నెట్టింట రెగ్యులర్‌ గా వార్తల్లో నిలుస్తున్న ముద్దుగుమ్మలు మంచి సినిమా ఆఫర్లు సైతం దక్కించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల మేకర్స్ నుంచి చిన్న హీరోల మేకర్స్ వరకు సోషల్ మీడియాలో హీరోయిన్స్ షేర్‌ చేస్తున్న ఫోటోలను చూసి తమ సినిమాల్లో హీరోయిన్స్ గా ఎంపిక చేసుకుంటున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో ఫోటోలు షేర్‌ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాల్లో హిట్‌ అవ్వని వారు సైతం సోషల్‌ మీడియాలో అందాల ఫోటోలు షేర్‌ చేసి ఆకట్టుకుంటున్నారు.

ఇటీవల తెలుగు ప్రేక్షకులకు సేవ్ ది టైగర్స్‌ వెబ్‌ సిరీస్‌ తో పరిచయం అయిన ముద్దుగుమ్మ దేవియాని శర్మ. చాలా తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ఈమె సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలను షేర్‌ చేస్తూ వస్తోంది. తాజాగా ఈమె షేర్‌ చేసిన ఈ అందాల ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. స్టార్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా అందంగా ఈ అమ్మడు ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయి అందంతో మరిన్ని ప్రాజెక్ట్‌ లు చేయాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తాజాగా ఈమె షేర్ చేసిన ఈ బ్లాక్ అండ్‌ వైట్‌ ఫోటోలు మతి పోగొడుతున్నాయి. టాప్‌ యాంగిల్‌ లో క్లీ వేజ్ షో చేస్తూ కన్నుల విందు చేసిన దేవయాని శర్మ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇదే రేంజ్ లో ముందు ముందూ వరుసగా ఫోటో షూట్స్ ను షేర్‌ చేస్తే తప్పకుండా ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే ఈమె ముందు ముందు తప్పకుండా సినిమాల్లో మరింత బిజీ అయ్యే అవకాశాలు లేకపోలేదు అనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు వ్యక్తం చేస్తున్నారు.

సైతాన్‌, రొమాంటిక్, అనగనగా ప్రాజెక్ట్ ల్లో నటించినా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయిన దేవయాని శర్మ సేవ్‌ ది టైగర్స్ సిరీస్‌ తో మాత్రం స్టార్‌ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో వరుసగా ఫోటోలను అది కూడా స్కిన్‌ షో ఫోటోలను షేర్ చేయడం ద్వారా నెటిజన్స్ కి చేరువ అయింది. ముందు ముందు ఈ అమ్మడు వరుసగా సినిమాలు, సిరీస్ ల్లో నటించాలని ఫాలోవర్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. నెట్టింట ప్రస్తుతం ఈ అమ్మడి జోరు కొనసాగుతోంది. ఈ బ్లాక్ అండ్‌ వైట్‌ ఫోటోలు సైతం అందరి దృష్టిని ఆక్షిస్తున్నాయి.