డిజాస్టర్ మూవీ రీ రిలీజ్ ఇదేం రచ్చ బాబోయ్..!
టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇతర భాషల్లో అప్పుడప్పుడు సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 12 Sep 2024 7:30 PM GMTటాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇతర భాషల్లో అప్పుడప్పుడు సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. కానీ తెలుగు ప్రేక్షకులు ఆదరించిన స్థాయిలో మరే భాషలో పాత సినిమాల రీ రిలీజ్ కు ఆధరణ దక్కడం లేదు. ఇంద్ర, మురారి, గబ్బర్ సింగ్ ఇలా దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన దక్కింది. రీ రిలీజ్ కి మరిన్ని సినిమాలు సిద్ధం అయ్యేలా ఆ సినిమాల వసూళ్లు నమోదు అయ్యాయి. ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ మొదలు కాబోతుంది. తెలుగు లో డబ్బింగ్ సినిమాలనూ రీ రిలీజ్ చేయాలనే ప్రయత్నాలు షురూ అయ్యాయి.
ధనుష్ హీరోగా నటించిన '3' సినిమా దాదాపు 12 ఏళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో ధనుష్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించింది. అప్పట్లో సినిమాలోని అనిరుధ్ స్వరపరిచిన వై దిస్ కొలవెరిడీ పాటకు దేశం మొత్తం ఊగి పోయింది. సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ధనుష్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. స్కూల్ ఏజ్ కుర్రాడి పాత్రలో కనిపించడం కోసం ధనుష్ చాలా వర్కౌట్ లు చేశాడు. కానీ సినిమా వర్కౌట్ అవ్వలేదు.
తెలుగు బాక్సాఫీస్ వద్ద మినిమం వసూళ్లు సాధించలేక పోయిన '3' సినిమా ను ఇప్పుడు రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. 4కే పిక్చర్ క్వాలిటీతో ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ముఖ్య నగరాలు, పట్టణాల్లో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. కొన్ని ముఖ్య నగరాల్లో ధనుష్ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఏకంగా అడ్వాన్స్ బుకింగ్‌తోనే హౌస్ ఫుల్ అయ్యాయి. ఈనెల 14న రీ రిలీజ్ కాబోతున్న '3' సినిమా కి వస్తున్న వసూళ్లకి మేకర్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ధనుష్ ఒక తెలుగు స్టార్ హీరో కాడు, ఆయనకు తెలుగు ప్రేక్షకుల్లో పెద్దగా ఫ్యాన్ బేస్ లేదు, పైగా సినిమా గతంలో విడుదలై డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది. అయినా రీ రిలీజ్ కి నమోదు అవుతున్న వసూళ్ల నెంబర్ చూస్తే బాబోయ్ అనిపించక మానదు. ఈ స్థాయిలో సినిమా పై ఉన్న ఆసక్తితో టికెట్లు కొనుగోలు చేస్తున్నారా లేదంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ధనుష్ క్రేజ్ పెరిగిందా అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. డిజాస్టర్ మూవీ రీ రిలీజ్ అవ్వడమే గొప్ప విషయం అంటే అడ్వాన్స్ బుకింగ్ ఈ స్థాయిలో నమోదు అవ్వడం పెద్ద షాకింగ్ గా ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.