Begin typing your search above and press return to search.

కలిసి ఉండాలని మాకు లేదు: ధనుష్‌ దంపతులు

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఆయన సతీమణి ఐశ్వర్య రజనీకాంత్‌.. విడాకుల కోసం ఇప్పటికే ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   21 Nov 2024 5:48 PM GMT
కలిసి ఉండాలని మాకు లేదు: ధనుష్‌ దంపతులు
X

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఆయన సతీమణి ఐశ్వర్య రజనీకాంత్‌.. విడాకుల కోసం ఇప్పటికే ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. వీరి దరఖాస్తుపై చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు గురువారం విచారణ జరిపింది. తొలిసారి ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ కోర్టుకు హాజరయ్యారు.

ఆ సందర్భంగా ధనుష్, ఐశ్వర్య.. తామిద్దరూ విడిపోవడానికి గల కారణాలు ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టుకు తెలియజేశారు. తాము కలిసి ఉండాలనుకోవడం లేదని చెప్పారు. విడిపోవాలనే నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఇరువురి వాదనలు విన్న కోర్టు తుది విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది. ఆ రోజున తుది తీర్పును వెలువరించనుంది.

కాగా, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య.. వయసులో ధనుష్‌ కంటే పెద్దదనే సంగతి తెలిసిందే. చదువుకున్న టైమ్ లో ధనుష్ వాళ్ల సోదరి, ఐశ్వర్య మంచి ఫ్రెండ్స్. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత స్నేహం కుదిరింది. కొంత కాలం తర్వాత అది ప్రేమగా మారింది.

ఇరువైపుల పెద్దల అంగీకారంతో 2004 నవంబర్‌ 18న వివాహం జరిగింది. వారి వివాహ బంధానికి గుర్తుగా యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే 18 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ తాము విడిపోవాలని అనుకుంటున్నామని 2022లో ధనుష్‌ సోషల్ మీడియాలో ప్రకటించారు.

పరస్పర అంగీకారంతో తాము నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. 18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకుని తమ ప్రయాణాన్ని కొనసాగించామని తెలిపారు. కానీ ఇప్పుడు తాము వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యామని ధనుష్‌ పోస్ట్‌ పెట్టారు.

అప్పటి నుంచి ధనుష్, ఐశ్వర్య విడివిడిగా నివసిస్తున్నారు. డివోర్స్‌ ప్రకటన తర్వాత ఆ జంట వారి కుమారుల పాఠశాల కార్యక్రమాల్లో కనిపించిన విషయం తెలిసిందే. అయితే విడాకుల కోసం చెన్నై వెల్ఫేర్ కోర్టును ఆశ్రయించిన ధనుష్, ఐశ్వర్య.. పలుమార్లు కేసు విచారణకు వచ్చినా హాజరు కాలేదు. తాజాగా కోర్టుకు హాజరై తమ విడిపోవడానికే డిసైడ్ అయినట్లు చెప్పేశారు.