రజినీ కోసం.. ధనుష్, ఐశ్వర్య
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. వేట్టయన్ మూవీతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 10 Oct 2024 12:14 PM GMTకోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. వేట్టయన్ మూవీతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జై భీమ్ ఫేమ్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రముఖ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఆ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ తోపాటు తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు.
అయితే గురువారం థియేటర్లలో రిలీజ్ అయిన వేట్టయన్ చిత్రాన్ని ఆయన కుమార్తె ఐశ్వర్య, అల్లుడు ధనుష్ ఒకేచోట చూశారు! అందుకు సంబంధించిన పిక్స్, వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చెన్నైలోని ఓ థియేటర్ కు వెళ్లిన హీరో ధనుష్.. ఫ్యాన్స్ తో కలిసి వేట్టయన్ చిత్రాన్ని చూశారు. అదే థియేటర్ లో రజినీకాంత్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సందడి చేశారు. తలైవా సతీమణి లత, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య.. ధనుష్ ఉన్న హాల్ లోనే సినిమా చూశారు.
ఇక సోషల్ మీడియాలో ఆ విషయం వైరల్ గా మారడంతో నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. ఒకే హాల్ లో ఐశ్వర్య, ధనుష్ సినిమా చూడడం హ్యాపీగా ఉందని చెబుతున్నారు. మళ్లీ ఇద్దరూ కలిసిపోవాలని కోరుకుంటున్నట్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఐశ్వర్య, ధనుష్.. 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం.. పలు వ్యక్తిగత కారణాల వల్ల విడిపోతున్నట్లు ప్రకటించారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆ తర్వాత విడాకుల కోసం కోర్టును ఐశ్వర్య, ధనుష్ ఆశ్రయించారు. ఆ సమయంలో వారిద్దరినీ కలిపేందుకు ఇరువైపుల కుటుంబ సభ్యులు బాగా ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. రజినీకాంత్.. ముఖ్యపాత్ర పోషించి పలు చర్చలు జరిపినట్లు టాక్ వినిపించింది. కానీ కుటుంబ సభ్యుల ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. రీసెంట్ గా జరిగిన విచారణకు ఇద్దరూ హాజరు కాలేదు. దీంతో న్యాయస్థానం అక్టోబర్ 19కి వాయిదా వేసింది.
అయితే అక్టోబర్ 9వ తేదీన జరగాల్సిన విచారణకు ధనుష్, ఐశ్వర్య హాజరు కాకపోవడంతో కోలీవుడ్ వర్గాల్లో అనేక అనుమానాలు మొదలయ్యాయి. రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ధనుష్- ఐశ్వర్య తమ విడాకులు రద్దు చేసుకుంటున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకే విచారణకు ఇద్దరూ హాజరు కాలేదని చెబుతున్నారు. కానీ ఇందులో నిజమెంత అనేది మాత్రం ఎవరికీ తెలియదు.