ధనుష్.. ఎంతైనా గ్రేటే..
గత ఏడాది రాయన్ తో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు ధనుష్.
By: Tupaki Desk | 22 Feb 2025 6:45 AM GMTకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దూసుకుపోతున్నారు. ఓవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. మరోవైపు దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. గత ఏడాది రాయన్ తో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు ధనుష్.
తన మేనల్లుడు పవీష్ నారాయణన్ ను హీరోగా జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీతో పరిచయం చేశారు. జెన్ జీ బ్యాచ్‌ను టార్గెట్ చేస్తూ తీసిన ఆ మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రోమ్ కామ్ డ్రామాగా ఆడియన్స్ ను మెప్పించింది. కొంతమంది కుర్రాళ్లు, కుర్ర భామలతో తెరకెక్కిన ఆ మూవీ.. మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
అయితే ఆ సినిమాకు సంబంధించిన ఓ రిహార్సిల్ వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అందులో పవీష్ కు ధనుష్.. సీన్ ను నెరేట్ చేస్తూ కనిపించారు. అంతే కాదు.. ఆయన నటించి మరీ చూపించారు. పాత్రలో జీవించేశారు. సీన్ లో భాగంగా నిజంగా టీ షర్ట్ తో నటి కాళ్లు తుడిచారు. దీంతో ఇప్పుడు నెటిజన్లు స్పందిస్తున్నారు.
ధనుష్ చాలా గ్రేట్ అని కామెంట్లు పెడుతున్నారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తన టీ షర్ట్ తో నటి కాళ్లు తుడిచారని చెబుతున్నారు. అదే సమయంలో ధనుష్ లా పవీష్ చేయలేదని చెబుతున్నారు. మ్యాచ్ కూడా చేయలేకపోయారని కొందరు అంటున్నారు. అయితే కొత్త హీరో కదా.. ఎక్స్పీరియన్స్ కావాలి కదా అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇక ధనుష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన తెలుగులో కుబేర మూవీ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మూవీలో ధనుష్ బిచ్చగాడి రోల్ లో కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్, రూమర్స్.. సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది.
మరోవైపు, నిత్యా మీనన్ తో ఇడ్లీ కడై టైటిల్ తో ధనుష్ మూవీ చేస్తున్నారు. నటిస్తూనే దర్శకత్వం కూడా వహిస్తున్నారు. వాటితో పాటు మరిన్ని ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. ఇంకొన్ని వాటి కోసం చర్చిస్తున్నారు. దీంతో ధనుష్.. వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. మరి ఆయన ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.