Begin typing your search above and press return to search.

చంద్రబాబు బయోపిక్ లో ధనుష్!

అయితే జీపీ చంద్రబాబు బయోపిక్ లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్ పోషించనున్నారని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   14 Dec 2024 6:35 PM GMT
చంద్రబాబు బయోపిక్ లో ధనుష్!
X

సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ కు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. తమ అభిమాన సెలబ్రిటీల జీవితాలను తెర మీద ఆవిష్కరిస్తే సినీ ప్రియులు పండగ చేసుకుంటారు! అందుకు సంబంధించిన ప్రాజెక్టుల అనౌన్స్మెంట్స్ వస్తే చాలా హ్యాపీగా ఫీలవుతుంటారు. అదే సమయంలో ఊహాగానాలు వస్తే అవి నిజమవ్వాలని కోరుకుంటూ ఉంటారు.

ప్రస్తుతం సిల్క్ స్మిత, ఇళయరాజా తదితరుల బయోపిక్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. వాటి కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్ కు చెందిన ఓ దివంగత కమెడియన్ కమ్ హీరో బయోపిక్ రూపొందనుందని జోరుగా ప్రచారం సాగుతోంది.

1950-1970 మధ్య తమిళ సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో హీరోగా, కమెడియన్ గా నటించిన జేపీ చంద్రబాబు జీవిత కథను సినిమా రూపంలో ఆవిష్కరించేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జేపీ చంద్రబాబు.. ది లెజెండ్ టైటిల్ తో తెరకెక్కించనున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు అవుతున్నాయట.

అయితే జీపీ చంద్రబాబు బయోపిక్ లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్ పోషించనున్నారని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలో అనౌన్స్మెంట్ రానుందని వినికిడి. డైరెక్టర్, ఇతర వివరాలను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ అనౌన్స్ చేయనుందని సమాచారం.

ఇక జేపీ చంద్రబాబు బయోపిక్ ను సీనియర్ దర్శకుడు కె.రాజేశ్వర్ తెరకెక్కిస్తారని కొన్నేళ్లు క్రితం వార్తలు వచ్చాయి. ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ తీసిన ఆయన.. రూపొందిస్తారని టాక్ వచ్చింది. కానీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మాత్రం ధనుష్ లీడ్ రోల్ లో జేపీ చంద్రబాబు బయోపిక్ రెడీ అవ్వడం పక్కా అని సమాచారం.

అయితే జేపీ చంద్రబాబు 1950-1970 టైమ్ లో వేరే లెవెల్ లో అలరించారు కనుక.. ఆయన బయోపిక్ లో అనేక మంది అప్పటి తారల పాత్రలు ఉండబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దివంగత ఎంజీఆర్, జెమినీ గణేషన్, సావిత్రి తదితర నటీనటులతో పాటు రాజకీయ నాయకుల పాత్రలు కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. మరి చంద్రబాబు బయోపిక్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎవరెవరు నటిస్తారో వేచి చూడాలి.