Begin typing your search above and press return to search.

కుబేర.. పోటీ ఉన్నా తగ్గట్లేదు

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబినేషన్ లో మల్టీ స్టారర్ చిత్రంగా ‘కుభేర’ తెరకెక్కుతోంది.

By:  Tupaki Desk   |   18 Sep 2024 3:49 AM GMT
కుబేర.. పోటీ ఉన్నా తగ్గట్లేదు
X

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబినేషన్ లో మల్టీ స్టారర్ చిత్రంగా ‘కుభేర’ తెరకెక్కుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ పాన్ ఇండియా మూవీ రెడీ అవుతోంది. ఏషియన్ మూవీస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ‘సార్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ధనుష్ స్ట్రైట్ తెలుగులో చేస్తోన్న సినిమా ఇదే కావడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ చిత్రంలో ధనుష్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా ఉండబోతోందనే మాట వినిపిస్తోంది.

ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఒక డిఫరెంట్ పాత్రలో పవర్ఫుల్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ధనుష్ క్యారెక్టర్ పేదవాడిగా ఉండబోతోంది. రష్మిక మందన మరో ఇంట్రెస్టింగ్ రోల్ లో కనిపించబోతోంది. వీరి క్యారెక్టర్స్ జర్నీ గానే సినిమా కథని శేఖర్ కమ్ముల చెప్పబోతున్నారని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల సినిమాలు అంటే మనం రెగ్యులర్ గా నిజజీవితంలో చూసిన కథలే కనిపిస్తాయి. కానీ ఆయన ఆ కథను చెప్పే విధానం, ఎమోషనల్ జర్నీ ప్రేక్షకులకి కనెక్ట్ అవుతాయి.

అందుకే శేఖర్ కమ్ముల సినిమాలు ఎక్కువగా సక్సెస్ అయ్యాయి. ఇదిలా ఉంటే ‘కుభేర’ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. రిలీజ్ డేట్ ని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. డిసెంబర్ 6న ‘పుష్ప ది రూల్’ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లోకి వస్తోంది. మోస్ట్ అవైటెడ్ మూవీ గా ఈ సినిమా ఉంది. డిసెంబర్ 20న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

‘కుభేర’ మూవీ రిలీజ్ రిలీజ్ కోసం ఈ రెండు డేట్స్ లో ఏదో ఒక దాన్ని ఫిక్స్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ‘పుష్ప ది రూల్’ చిత్రానికి పోటీగా అంటే కచ్చితంగా సినిమా రిజల్ట్ పై ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. పబ్లిక్ అటెన్షన్ ఎక్కువగా ‘పుష్ప ది రూల్’ చిత్రం మీదనే ఉంటుంది. అందుకే ఇది బెస్ట్ డేట్ కాకపోవచ్చని చెబుతున్నారు. డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తే ‘గేమ్ చేంజర్’ పోటీలో ఉంటుంది. ‘పుష్ప 2’ తో పోల్చుకుంటే ‘గేమ్ చేంజర్’ మూవీ పై కొంత తక్కువ బజ్ ఉంది.

శేఖర్ కమ్ముల సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ బేస్ ఉంటుంది. యూత్ లో కూడా ఒక రకమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ‘గేమ్ చేంజర్’ కి పోటీగా ‘కుభేర’ చిత్రాన్ని రిలీజ్ చేసిన పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి శేఖర్ కమ్ముల టీం ఆలోచన ఎలా ఉంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ‘కుభేర’ మూవీ డిసెంబర్ 20 రిలీజ్ కన్ఫామ్ అయితే మాత్రం థియేటర్స్ లో ఇంట్రెస్టింగ్ పోటీ నడవడం గ్యారెంటీ అని భావిస్తున్నారు.