Begin typing your search above and press return to search.

అనుకున్నదే జరిగింది... ఆ క్రేజీ మూవీ డేట్‌ మార్పు!

తమిళ్ స్టార్‌ హీరో ధనుష్‌ వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నారు. ఒక వైపు హీరోగా నటిస్తూ మరో వైపు తన దర్శకత్వంలో సినిమాలను రూపొందిస్తున్నారు.

By:  Tupaki Desk   |   17 Jan 2025 6:11 AM GMT
అనుకున్నదే జరిగింది... ఆ క్రేజీ మూవీ డేట్‌ మార్పు!
X

తమిళ్ స్టార్‌ హీరో ధనుష్‌ వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నారు. ఒక వైపు హీరోగా నటిస్తూ మరో వైపు తన దర్శకత్వంలో సినిమాలను రూపొందిస్తున్నారు. అంతే కాకుండా ప్రొడక్షన్ హౌస్‌ నుంచి క్రమం తప్పకుండా సినిమాలను నిర్మిస్తూ వస్తున్నాడు. గత ఏడాది రాయన్‌ సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్‌ ఈ ఏడాది ఆరంభంలోనే 'నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబం' సినిమాతో దర్శకుడిగా రాబోతున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోగా ధనుష్ నటించకుండా ఆయన మేనల్లుడు పవీష్ హీరోగా నటించాడు. పవీష్‌ను హీరోగా పరిచయం చేసే బాధ్యత ధనుష్ తన భుజాలపై వేసుకున్నాడు.

భారీ అంచనాల నడుమ ధనుష్ దర్శకత్వంలో రూపొందిన 'నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబం' సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమాకు ధనుష్ దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈ సినిమాలో ధనుష్‌ను కీలక పాత్రలో చూడబోతున్నారని తెలుస్తోంది. ధనుష్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబం' సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేయాలని భావించారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే సినిమా విడుదల తేదీ విషయంలో గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.

పొంగల్‌ కానుకగా విడుదల కావాల్సిన తమిళ్‌ స్టార్‌ హీరో అజిత్‌ మూవీ 'విడాముయాచర్చి' సినిమా వాయిదా పడింది. కారణం ఏంటి అనేది క్లారిటీ ఇవ్వలేదు, కానీ అప్పుడు విడుదల కావాల్సిన సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అదే సమయంలో విడుదల కావాల్సిన ధనుష్‌ మేనల్లుడి మూవీ సందిగ్దంలో పడ్డట్లు అయ్యింది. ధనుష్‌ హీరోగా నటించిన సినిమా అయితే డౌట్‌ లేకుండా విడుదల చేసే వారు. కానీ పవీష్‌ ని హీరోగా పరిచయం చేస్తున్న సినిమా కావడంతో ధనుష్ ఆలోచనలో పడ్డారనే ప్రచారం జరిగింది. సినిమా విడుదల తేదీ మార్పు గురించి వార్తలు వచ్చాయి. చివరకు అదే జరిగింది.

ధనుష్‌ తన నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబం సినిమాను వారం ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించుకున్నారు. కోలీవుడ్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం జనవరి 30వ తారీకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్‌ కాపీ సైతం సిద్ధం అయ్యింది. కనుక త్వరలోనే సెన్సార్‌ ఫార్మాల్టీస్‌ కంప్లీట్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త విడుదల తేదీ విషయమై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కారణంగానే ధనుష్‌, నాగార్జున ముఖ్య పాత్రల్లో నటించిన కుబేరా తెలుగు సినిమాను వాయిదా వేశారనే వార్తలు వస్తున్నాయి. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేరా సినిమాను సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.