మరో సంచలన వాస్తవ సంఘటనతో స్టార్ కాంబో!
తాజాగా దీనికి సంబంధించి మరో అప్ డేట్ తెరపైకి వస్తోంది. ఇదొక ఇన్వస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రమని వినిపిస్తుంది.
By: Tupaki Desk | 26 Jan 2025 7:30 AM GMTకోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా 'అమరన్' డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియాస్వామి కొత్త ప్రాజెక్ట్ ని ఇటీవల పట్టా లెక్కించిన సంగతి తెలిసిందే. 'అమరన్' విజయంతో రాజ్ కుమార్ ఒక్కసారిగా కోలీవుడ్...టాలీవుడ్..బాలీవుడ్ లో ఫేమస్ అయ్యా డు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ తో పాటు ధనుష్ 55 చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ అందు కున్నాడు. ఈ నేపథ్యంలో డి55 స్టోరీ ఏంటి? అన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా అందుతోన్న సమచారం ప్రకారం ఇది వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిస్తోన్న చిత్రమని తెలుస్తోంది.
సమాజంలో ఎందరో రియల్ లైఫ్ హీరోలు న్నారు. వాళ్ల కథన సినిమాగా మలిస్తే అద్బుతాలకు అవకాశం ఉందని ఓ సందర్భంలో రాజ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో డి 55 రియల్ స్టోరీ ఆధారంగానే తెరెక్కుతుందని క్లారిటీ వస్తోంది. తాజాగా దీనికి సంబంధించి మరో అప్ డేట్ తెరపైకి వస్తోంది. ఇదొక ఇన్వస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రమని వినిపిస్తుంది. నిజ జీవితంలో జరిగిన ఓ క్రైమ్ విచారణ ఆధారంగా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రం కోసం ధనుష్ పూర్తిగా కొత్త పాత్ర పోషిస్తారని సమాచారం. ఇందులో ధనుష్ లుక్ రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉంటుందంటున్నారు. ఈ పాత్రకు సంబంధించి ధనుష్ వాస్తవ పాత్రను తలపించేలా సిద్దమవు తున్నాడుట. ఆ నాటి ఇన్వస్టిగేషన్ కి సంబంధించి వీలైనంత వరకూ వాస్తవ పాత్రతను తలపించేలా రెడీ అవుతున్నాడుట.
ఇందులో ధనుష్ కి జోడీగా ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదు. ఇందులో శ్రుతి హాసన్ ఎంపికైందని చిత్ర వర్గాల సమాచారం. ఓ డిఫరెంట్ పాత్రలో శ్రుతి హాసన్ నటిస్తుందిట. ఇప్పటి వరకూ శ్రుతి పోషించని రోల్ ఇదని అంటు న్నారు. రామస్వామి పాత్ర గురించి చెప్పకుండా మరో మాట లేకుండా ఎస్ చెప్పిందిట. అంతగా ఆ పాత్రకు శ్రుతి హాసన్ కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది.