Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లో ధనుష్‌ కి ఇష్టమైన హీరో ఎవరంటే..!

'జాబిలమ్మ నీకు అంత కోపమా' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ధనుష్‌ గతంలో మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చిత్ర యూనిట్‌ సభ్యులు వైరల్‌ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 Feb 2025 6:11 AM GMT
టాలీవుడ్‌లో ధనుష్‌ కి ఇష్టమైన హీరో ఎవరంటే..!
X

కోలీవుడ్‌లోనే కాకుండా పాన్‌ ఇండియా రేంజ్‌లో తన సినిమాలతో దూసుకు పోతున్న యంగ్‌ స్టార్‌ ధనుష్‌. హీరోగా ఏడాదికి రెండు మూడు సినిమాలతో వస్తున్న ధనుష్ దర్శకుడిగానూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆయన దర్శకుడిగా మూడు సినిమాలు వచ్చాయి. మొదటి రెండు సినిమాల్లో ఆయనే హీరోగా నటించగా, మూడో సినిమాలో మాత్రం మేనల్లుడు పవిష్‌ని హీరోగా పరిచయం చేశారు. ధనుష్ దర్శకుడిగా గత ఏడాది వచ్చిన రాయన్‌ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో తాజా చిత్రంపై సహజంగానే అంచనాలు పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది.

ధనుష్ దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమాను తెలుగులో 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు మంచి స్పందన దక్కింది. ఇతర చిన్న సినిమాలు ఉన్న ఈ సినిమాకు అత్యధిక వసూళ్లు నమోదు అవుతున్నాయని సమాచారం అందుతోంది. ధనుష్ దర్శకుడిగా మరిన్ని మంచి సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒక లవ్‌ స్టోరీని ఇంత సింపుల్‌గా, యూత్‌ను ఆకట్టుకునే విధంగా తీయవచ్చా అంటూ సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయే విధంగా ధనుష్ ఈ సినిమాను రూపొందించారు.

'జాబిలమ్మ నీకు అంత కోపమా' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ధనుష్‌ గతంలో మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చిత్ర యూనిట్‌ సభ్యులు వైరల్‌ చేస్తున్నారు. టాలీవుడ్‌ హీరోల్లో మీకు ఏ హీరో అంటే ఇష్టం అంటూ ధనుష్‌ను గతంలో ఒక ఇంటర్వ్యూలో యాంకర్‌ అడిగారు. అందుకు ధనుష్ స్పందిస్తూ తనకు టాలీవుడ్‌ సినిమాలు అంటే ఇష్టం. అలాగే తెలుగులో చాలా మంది హీరోలు అంటే తనకు ఇష్టం అన్నారు. తెలుగులో నాకు ఎవరు ఇష్టమో చెబుతాను కానీ ఇతర హీరోల ఫ్యాన్స్‌ నన్ను ట్రోల్‌ చేయవద్దని అన్నాడు. తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని ధనుష్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

టాలీవుడ్‌లో ధనుష్ సార్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు దర్శకుడు రూపొందించిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరా సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు తమిళ్‌లో ధనుష్‌ రెండు సినిమాలను చేస్తున్నారు. ధనుష్ దర్శకుడిగా నాలుగో సినిమా ఎప్పుడు, ఎలా, ఎవరితో ఉంటుందా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడిగా ధనుష్‌ ఏడాదికి ఒక సినిమా చొప్పున చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ధనుష్ తదుపరి సినిమా విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.