ఆ స్టార్ హీరోపై నిషేధం ఎత్తివేత!
కోలీవుడ్ ఇండస్ట్రీ హీరో ధనుష్ పై అప్పట్లో రెడ్ కార్డ్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 Sep 2024 6:54 AM GMTకోలీవుడ్ ఇండస్ట్రీ హీరో ధనుష్ పై అప్పట్లో రెడ్ కార్డ్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ దీనికి సంబంధించి జులైలో ఓ తీర్మానం కూడా చేసింది. నవంబర్ 1 నుంచి ధనుష్ తో ఏ నిర్మాత సినిమాలు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. అతడు ముందుగా ఎవరి దగ్గరైతే అడ్వాన్సులు తీసుకున్నాడో? వాళ్ల సినిమాలు పూర్తి చేయాలని, అంతవరకూ కొత్త నిర్మాతలెవరూ అడ్వా న్సులు ఇవ్వొద్దని..అతడు తీసుకోవడానికి వీలు లేదంటూ నిర్మాతల సంఘం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
దీనిపై ఆ మధ్య పెద్ద దుమారమే లేచింది. ధనుష్ ని సంప్రదించకుండా...నడిగర్ సంఘం నిర్ణయం తీసుకోకుండా నిర్మాతల సంఘం ఇలా వ్యవహరిచడం సమజసం కాదని అభ్యంతరం వ్యక్తమైంది. అయినా నిర్మాతల సంఘం వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే జులైలో రెడ్ కార్డు జారీ అయింది.
త్రేండాల్ ఫిల్మ్స్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్స్ నుంచి సినిమాలు చేసేందుకు ధనుష్ అడ్వాన్సులు తీసుకున్నట్లు ప్రచారంలో ఉంది. కానీ ఎన్ని సంవత్సరాలైనా ఆ సినిమాలు పూర్తి చేయకపోవడంతో నిర్మాణ సంస్థలు నిర్మాతల సంఘాన్ని ఆశ్రయించాయి. ఈనేపథ్యంలో టీఎఫ్ పీసీ నుంచి రెడ్ కార్డు జారీ అయింది. కానీ ధనుష్ మాత్రం దీని గురించి ఎక్కడా మాట్లాడటలేదు. అతడికి మద్దతుగా నడిగర్ సంఘం సహా పలు సంఘాలు నిలబడ్డాయి.
కానీ ఆయన మాత్రం కెమెరా ముందుకొచ్చి వివరణ ఇచ్చింది లేదు. ఈనేపథ్యంలో తాజాగా ఆయా నిర్మణ సంస్థల నుంచి ధనుష్ సెటిల్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తీసుకున్న అడ్వాన్స్ కి వడ్డీతో సహా చెల్లిస్తానని ...అంగీకారమైతే సినిమాలు కూడా చేస్తానని ఒప్పందం చేసుకున్నాడుట. దీంతో ఈ విషయా న్ని నిర్మాణ సంస్థలు టీఎఫ్ పీసీకి తెలపడంతో రెడ్ కార్డ్ ని రద్దు చేసినట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది.