Begin typing your search above and press return to search.

ఆ సూప‌ర్ జోడీ విడాకుల‌పై తుది నిర్ణ‌యం!

త్వ‌ర‌లో విడాకుల‌ కేసు కోర్టులో విచార‌ణ‌కు రానున్న‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   8 April 2024 12:46 PM GMT
ఆ సూప‌ర్ జోడీ విడాకుల‌పై తుది నిర్ణ‌యం!
X

ధ‌నుష్‌-ఐశ్వ‌ర్యా ర‌జ‌నీకాంత్ బంధం విడాకుల‌తో వేర‌వుతుందా? రెండేళ్ల పాటు మ‌న‌సులు మార‌తాయ‌ని చేసిన ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైందా? అంటే అవున‌నే తెలుస్తోంది. తాజాగా ఈ జంట చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ప‌ర‌స్ప‌ర అంగీకారంతో ఇరువురు విడిపోయేందుకు పిటీష‌న్లు దాఖ‌లు చేసిన‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. త్వ‌ర‌లో విడాకుల‌ కేసు కోర్టులో విచార‌ణ‌కు రానున్న‌ట్లు తెలుస్తోంది.

ఇద్ద‌రు విడిపోతున్న‌ట్లు 2022లోనే ప్ర‌క‌టించారు. అయితే కోర్టులో ఎవ‌రూ ఇంత‌వ‌ర‌కూ పిటీష‌న్ దాఖ‌లు చేయ‌లేదు. అంత‌కు ముందు నుంచే ఇద్ద‌రు దూరంగా ఉంటున్న‌ట్లు మీడియాలో ప్ర‌చారం సాగింది. ఇద్ద‌రిని క‌లిపేందుకు ఐశ్వ‌ర్య‌తండ్రి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ధనుష్ తండ్రి సైతం మీడియా ముందుకొచ్చి ధనుష్-ఐశ్వర్య మళ్ళీ కలుస్తారని.. రజనీకాంత్- తాను మాట్లాడి వాళ్ళు కలిసి ఉండేలా చూస్తామని చెప్పుకొచ్చారు.

మ‌ళ్లీ క‌లిసే అవ‌కాశం ఉంద‌ని కోలీవుడ్ మీడియాలో ప్ర‌చారం సాగింది. పిల్ల‌లు ఇద్ద‌రు పెద్ద‌వారు అయ్యేవ‌ర‌కూ విదేశాల‌కు వెళ్లేవ‌ర‌కూ క‌లిసి ఉండాల‌ని న‌చ్చజెప్పే ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్లు తెలుస్తోంది. కానీ ఆ ప్ర‌య‌త్నాలేవి ఫ‌లించ‌లేదు. దీంతో రెండేళ్లు పాటు గ్యాప్ తీసుకున్నారు. ఈలోపు ఇరువురు మ‌న‌సులు మారే అవ‌కాశం ఉంటుంద‌ని ఆ గ్యాప్ తీసుకున్నా! విరిగిన మ‌న‌సులు మ‌ళ్లీ క‌ల‌వ‌డం క‌ష్ట‌మ‌ని భావించి ఇద్ద‌రు విడాకుల‌కే మొగ్గు చూపుతున్న‌ట్లు దాదాపు తేలిపోయింది. 2004 లో ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య పెళ్లి చేసుకున్నారు. ఆ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమారులు క‌ల‌రు.

ఇక ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య ఇద్ద‌రు ఎవ‌రి వృత్తుల్లో వారు బిజీగా ఉన్నారు. ధ‌నుష్ సినిమా షూటింగ్ ల‌తో బిజీగా ఉన్నాడు. ఇట‌వ‌లే ఐశ్వ‌ర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `లాల్ స‌లామ్` ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. విష్ణు విశాల్...ర‌జ‌నీకాంత్ న‌టించిన సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది.