అసిస్టెంట్ పెళ్లికెళ్లిన స్టార్ హీరో!
తాజాగా ధనుష్ కూడా తన అసిస్టెంట్ ఆనంద్ పెళ్లికి హాజరై ఆ దంపతుల్ని ఆశీర్వదించాడు.
By: Tupaki Desk | 18 Sep 2023 7:47 AM GMTస్టార్ హీరోలు..హీరోయిన్లు స్టాప్ విషయంలో ఎలా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. వృత్తిపరంగా ఎంత కమిట్ మెంట్ తో ఉంటారో? వాళ్లకు కావాల్సిన కొన్ని రకాల సౌకర్యాలు కూడా బాగానే కల్పిస్తుంటారు. వ్యక్తిగతంగా వాళ్లతో మంచి సాన్నిహిత్యాన్ని కలిగి ఉంటారు. అందుకే వాళ్ల ఆనందాల్ని సైతం షేర్ చేసుకుంటారు. ఆ మధ్య రష్మిక తన అభిమాని పెళ్లికి హాజరై నూతన వధూవరుల్ని ఆశీర్వదించింది.
ఆ విషయాన్ని ఎక్కడా దాడి పెట్టలేదు. ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో స్వయంగా తానే షేర్ చేసింది. తాజాగా ధనుష్ కూడా తన అసిస్టెంట్ ఆనంద్ పెళ్లికి హాజరై ఆ దంపతుల్ని ఆశీర్వదించాడు. ధనుష్ తో పాటు సహ నటుడు కెన్ కరుణాస్ కూడా ఉన్నాడు. అంతేనా రాధిక...శరత్ కుమార్ కూడా ఆ పెళ్లికి హాజరయ్యారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ధనుష్ అలా వెళ్లడానికి అభిమానులు తెంగ సంబర పడుతున్నారు.
తన అసిస్టెంట్ పెళ్లికి అంత పెద్ద స్టార్ హాజరవ్వడంతో ధనుష్ సింప్లిసిటీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇలా వివాహాలకు హాజరవ్వడం అన్నది కోలీవుడ్ హీరోలకే చెల్లింది. అభిమానుల పెళ్లిళ్లకు కూడా స్టార్ హీరోలు ఇలాగే అటెండ్ అవుతుంటారు. తలపతి విజయ్..తల అజిత్ కూడా అభిమానులు ఆహ్వానిస్తే ..సమయం దొరికితే తప్పకుండా హాజరవుతుంటారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా గతంలో హాజరయ్యేవారు.
టాలీవుడ్ లో మాత్రం ఇలాంటి సన్నివేశాలు ఎక్కడా కనిపించవు. అభిమానులు హీరోల ఫోటోలు దేవుళ్ల పఠాలుగా భావించి ఎదురుగా పెట్టుకుని పెళ్లిళ్లు చేసుకుంటారు. ఆ సంగతి ఆ హీరోలకు తెలిస్తే మాత్రం ఇంటికి పిలిపించి ఆశీర్వదించి..భోజనం పెట్టి పంపిస్తుంటారు.