Begin typing your search above and press return to search.

స్టార్ హీరో ఇంత స్పీడ్ గా ముగించేసాడా?

ఓ ర‌కంగా చెప్పాలంటే ధ‌నుష్ మాలీవుడ్ స్టార్స్ తో పొల్చోచ్చు. మ‌మ్ముట్టి..మోహ‌న్ లాంటి సూప‌ర్ స్టార్లు ఏడాదికి ఆరు సినిమాలైనా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు.

By:  Tupaki Desk   |   15 Dec 2023 5:39 AM GMT
స్టార్ హీరో ఇంత స్పీడ్ గా ముగించేసాడా?
X

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ధ‌నుష్ ట్యాలెంట్ ప్ర‌త్యేక‌మైన‌ది. అత‌డు మ‌ల్టీట్యాలెంటెడ్. అత‌ను స్టార్ హీరోగానే కాదు..ద‌ర్శ‌కుడిగా...ర‌చ‌యిత‌గా...గాయ‌కుడిగా..నిర్మాత‌గా అన్ని రంగాల్లోనూ స‌త్తా చాటాడు. ఒకేసారి అన్ని ప‌నుల చేయ‌గ‌ల స‌మ‌ర్ధుడు. అందుకే ఓవైపు కోలీవుడ్ సినిమాలు చేస్తూనే మ‌రో వైపు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు..బాలీవుడ్ సినిమాలు సైతం చేయ‌గ‌ల్గుతున్నాడు. ఒకేసారి రెండు..మూడు షిప్ట్ ల్లో ప‌నిచేయ డం అన్న‌ది కోలీవుడ్ లో ధ‌నుష్ కి మాత్ర‌మే చెల్లింది.


ఓ ర‌కంగా చెప్పాలంటే ధ‌నుష్ మాలీవుడ్ స్టార్స్ తో పొల్చోచ్చు. మ‌మ్ముట్టి..మోహ‌న్ లాంటి సూప‌ర్ స్టార్లు ఏడాదికి ఆరు సినిమాలైనా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. అందుకు త‌గ్గ‌ట్టు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక అమ లు ప‌రిచి రెండు...మూడు షిప్ట్ లు ప‌నిచేస్తుంటారు. అందుకే అన్ని సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాగ‌ల్గుతున్నారు. తాజాగా ధ‌నుష్ చూస్తే వాళ్లే గుర్తొస్తున్నారు. ప్ర‌స్తుతం ధ‌నుష్ స్వీయా ద‌ర్శ‌క‌త్వం లో త‌న 50వ చిత్రాన్ని తానే డైరెక్ట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

దాదాపు ఆరేళ్ల త‌ర్వాత మెగా ఫోన్ ప‌ట్టి చేస్తోన్న చిత్ర‌మిది. 2023 జ‌న‌వ‌రిలో ప్ర‌క‌ట‌నించి..జులైలో షూటింగ్ ప్రారంభించారు. ఇంత‌వ‌ర‌కూ అంద‌రికీ తెలిసిన విష‌యం తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్త యింది. ఈ విష‌యాన్ని ధ‌నుష్ ట్వీట్ చేసి తెలిపాడు. త‌న విజ‌య్ ని స‌పోర్ట్ చేసిన న‌టీన‌టు లు.. సాంకేతిక నిపుణుల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ ఈ ట్వీట్ ఉంది. అంతేనే ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఇత‌ర ద‌ర్శ‌కులు చిత్రాల షూటింగ్ లోనూ ధ‌నుష్ పాల్గొన్నాడు.

చెన్నై...ముంబై..హైద‌రాబాద్ అంటూ 2023 లో ఎన్న‌డు చేయ‌న‌న్ని ప్లైట్ జ‌ర్నీలు చేసాడు. మ‌రోవైపు ఏడాదిన్నర‌ కాలంగా వ్య‌క్తిగ‌త జీవితంలో ధ‌నుష్ కొన్ని ర‌కాల స‌వాళ్లు ఎదుర్కోంటున్న సంగ‌తి తెలిసిందే. అయినా ఎక్క‌డా డిస్ట‌బెన్స్ కాకుండా అన్ని ప‌నులు పూర్తిచేస్తున్నాడు. ధ‌నుష్ లో ఈ క‌మిట్ మెంట్..డెడికేష‌న్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? ఆ సీక్రెట్ ఏంటో? మాకు చెప్పండి అంటూ తోటివారు ధ‌నుష్ ని అడుగుతున్నారు.