Begin typing your search above and press return to search.

మనం 5 నిమిషాలు కష్టం.. ధనుష్ 10 గంటలు ఉన్నాడు

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. అయితే కొద్ది మంది మాత్రమే రియల్‌ హీరోలు ఉన్నారు.

By:  Tupaki Desk   |   6 May 2024 9:36 AM GMT
మనం 5 నిమిషాలు కష్టం.. ధనుష్ 10 గంటలు ఉన్నాడు
X

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. అయితే కొద్ది మంది మాత్రమే రియల్‌ హీరోలు ఉన్నారు. అలాంటి రియల్‌ హీరోల్లో ధనుష్ ఒక్కడు అంటూ ఆయన ఫ్యాన్స్ తెగ ముచ్చట పడుతారు. ఇతర హీరోలకు సాధ్యం కాని ఎన్నో రికార్డులను, ఎన్నో అరుదైన గౌరవాన్ని ధనుష్ దక్కించుకున్న విషయం తెల్సిందే.

ప్రస్తుతం ధనుష్ కుబేరా సినిమాలో నటిస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర సినిమా షూటింగ్ చకచకా సాగుతోంది. సినిమా కథ డిమాండ్‌ మేరకు హీరో ధనుష్ కొన్ని సన్నివేశాల్లో డంపింగ్ యార్డ్‌ వద్ద కనిపించాల్సి ఉంటుందట. ఇటీవల ఆ షాట్స్ ను చిత్రీకరించారు.

డంపింగ్ యార్డ్‌ సన్నివేశాల కోసం ధనుష్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 గంటల పాటు అక్కడే ఉన్నాడట. సాధారణ జనాలు కనీసం 5 నిమిషాలు కూడా ఉండటం కష్టం. రోడ్డు మీద వెళ్తున్న సమయంలో డపింగ్ యార్డ్‌ కనిపిస్తే త్వరగా వెళ్లాలని స్పీడ్‌ గా వెళ్తాం. అలాంటిది 10 గంటలు ఉండటం అంటే మామూలు విషయం కాదు.

10 గంటలు నిలవడం కోసం ధనుష్ ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ తీసుకోలేదు. కనీసం ముక్కుకు మాస్క్ కూడా ధరించలేదు. షూటింగ్‌ జరుగుతున్నంత సమయం కూడా అక్కడే ఉన్నాడు తప్ప బయటకు రాలేదు. ఇలాంటి డెడికేషన్ కేవలం ధనుష్ లో మాత్రమే చూస్తామని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కుబేరా సినిమాలో ధనుష్ తో పాటు తెలుగు సీనియర్‌ స్టార్‌ హీరో నాగార్జున కూడా నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్‌ గా ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి. త్వరలో అన్ని విషయాలపై క్లారిటీ రానున్నాయి.