నాగర్జున వల్లే ధనుష్ ప్రాజెక్ట్ డిలే!
నాగార్జున కారణంగానే ప్రాజెక్ట్ ని కమ్ములా డిలే చేస్తున్నట్లు వినిపిస్తోంది. కింగ్ ఎంటర్ అయితే స్టోరీ మొత్తం మళ్లీ మార్చాల్సిం
By: Tupaki Desk | 27 July 2023 11:05 AM GMTధనుష్ కథానాయకుడిగా శేఖర్ కమ్ములా దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ లాక్ అయిన సంగతి తెలిసిందే. ఏడాదిన్నర క్రితమే ఈ ద్వయం సినిమా ప్రారంభోత్సవం జరిపింది.కానీ సినిమా ఇంతవరకూ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించలేదు. ఈ గ్యాప్ లో ధనుష్ వేర్వేరు సినిమాలు పూర్తి చేసారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై రకరకాల సందేహాలు తెరపైకి వచ్చాయి. సినిమా రద్దాయిందని ఓవైపు ప్రచారం సాగితే కాలేదని మరోవైపు వాదన వినిపించింది. దీంతో సినిమా ఉందా? లేదా? అన్న ఓ కన్ ప్యూజన్ తెరపైకి వచ్చింది.
అయితే తాజాగా ఈప్రాజెక్ట్ లోకి కింగ్ నాగార్జున చేరినట్లు నిన్నటి నుంచి మీడియాలో కథనాలు వెడెక్కిస్తున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యానికి అసలు కారణాలు ఏంటి? అన్నది ఒక్కొక్కటిగా బయటకొస్తున్నట్లు తెలుస్తోంది.
నాగార్జున కారణంగానే ప్రాజెక్ట్ ని కమ్ములా డిలే చేస్తున్నట్లు వినిపిస్తోంది. కింగ్ ఎంటర్ అయితే స్టోరీ మొత్తం మళ్లీ మార్చాల్సిందే. శేఖర్ కమ్ములా ఇప్పుడా పనిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఓ భారీ మల్టీస్టారర్ గా సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
నాగార్జున-ధనుష్ ఇద్దరి ఇమేజ్ ల్ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించాల్సిన సినిమా. కానీ కథ వాస్తవానికి ధనుష్ ఇమేజ్ ని బేస్ చేసుకుని కమ్ములా సిద్దం చేసారు. అందులో మార్పులు చేయాలంటే మొత్తం మార్చాల్సిందే.
సోల్ మాత్రమే తీసుకుని ఇద్దరి ఇమేజ్ ని బ్యాలెన్స్ చేస్తూ మళ్లీ కలానికి పనిచేబితే కానీ రూపం దాల్చడం కష్టం. అందుకే కమ్ములా మళ్లీ ప్రెష్ గా స్టోరీ సిద్దం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఇంకా కొన్ని నెలలు సమయం పట్టే అవకాశం ఉంది.
ఎందుకంటే శేఖర్ కమ్ములా వేగంగా స్టోరీలు సిద్దం చేయలేరు. ఆయన కథలు సిద్దం చేయడానికి చాలా సమయం తీసుకుంటారు. విదేశాలు వెళ్లి స్టోరీలు రాయనప్పటికీ సికింద్రా బాద్ ఆఫీస్ కలం పెట్టినప్పటికీ సమయం ఎక్కువగానే తీసుకుంటారు. క్రియేటివ్ పరంగా ఇన్నో వేటిగా ఉంటూనే మూలాలు ఎక్కడా దారి తప్పకుండా హైలైట్ చేయడం ఆయన ప్రత్యేకత.
స్టోరీలోనే కావాల్సినంత నేచురాల్టీని తీసుకురావడం ఆయన శైలి. పైగా ఇంతవరకూ ఆయన మల్టీస్టారర్ హీరోలకు కథలు రాసింది లేదు. తీసింది లేదు. ఇది కమ్ములాకి అతి పెద్ద ఛాలెంజ్. అందుకోసం ప్రత్యేక కసరత్తులు తప్పనిసరి. ఇలా ఇన్ని సమీకరణాల నేపథ్యంలో కమ్ములా ప్రాజెక్ట్ డిలే అవుతున్నట్లు తెలుస్తోంది.