ఆ ఇంటి కోసం 20 ఏళ్లు కష్టపడ్డ స్టార్ హీరో
ఒకప్పుడు హీరోల పారితోషికాలు చాలా తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు స్టార్‌డమ్ ను బట్టి పారితోషికం ఉంటుంది
By: Tupaki Desk | 9 July 2024 11:30 AM GMTఒకప్పుడు హీరోల పారితోషికాలు చాలా తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు స్టార్‌డమ్ ను బట్టి పారితోషికం ఉంటుంది. వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్న హీరోలు కూడా ఉన్నారు. తమిళ స్టార్ హీరో ధనుష్ ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ ఉంటాడు. ఆ మూడు నాలుగు సినిమాలకు కలిపి దాదాపుగా వంద కోట్ల పారితోషికం అందుకుంటాడు అనే టాక్ ఉంది.
చెన్నైలోని అత్యంత ఖరీదైన ఏరియా అయిన పోయేస్ గార్డెన్ లో ధనుష్ ఇటీవల ఇల్లు కట్టించుకున్నాడు. తాజాగా తన స్వీయ దర్శకత్వంలో రూపొందిన రాయన్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో పోయేస్ గార్డెన్ ఇల్లు గురించి ధనుష్ మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
ధనుష్ మాట్లాడుతూ... చిన్నప్పటి నుంచి పోయెస్ గార్డెన్ లో ఉన్న రజినీకాంత్ గారి ఇంటిని చూడాలని కోరిక ఉండేది. ఆ సమయంలోనే పోయెస్ గార్డెన్ లో ఒక చిన్న ఇల్లు అయినా నాకు ఉంటే బాగుంటుంది అనుకున్నాను. 16 ఏళ్ల వయసులో తుల్లువదో ఇళ్లమై అనే సినిమాలో నటించాను. ఆ సినిమా హిట్ కాకుంటే ఇప్పుడు ఎక్కడ ఉండేవాడినో నాకే తెలియదు.
20 ఏళ్ల తర్వాత నేను కోరుకున్నట్లుగా పోయెస్ గార్డెన్ లో ఇల్లు కట్టుకున్నాను. నా 20 ఏళ్ల కఠోర శ్రమకు ఇది ప్రతిఫలం అని నాకు బాగా తెలుసు. ఈ శ్రమలో నా సన్నిహితులు అభిమానుల సహకారం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటాను. నా అభిమానులు నాకు మద్దతుగా నిలవడం వల్లే ఈ స్థాయిలో ఉన్నాను అన్నాడు.
రాయన్ సినిమా తో మరోసారి ధనుష్ విశ్వరూపం చూడబోతున్నామని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. జూలై 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ధనుష్ లుక్ కి ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. తప్పకుండా ఈ సినిమా ఆయన స్థాయిని మరింతగా పెంచడం ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.