Begin typing your search above and press return to search.

ధనుష్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ ?

సినిమా మొదటి షో అంత గొప్పగా రాకపోయినా చిన్నగా సినిమా సక్సెస్ రూట్ లోకి వెళ్లింది.

By:  Tupaki Desk   |   30 July 2024 11:30 PM GMT
ధనుష్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ ?
X

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఓ పక్క తన నటనతో డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. తెలుగులో కూడా లాస్ట్ ఇయర్ సార్ ప్రస్తుతం కుబేర సినిమా చేస్తున్నాడు ధనుష్. ఐతే చూడటానికి బక్కపలచగా కనిపించే ధనుష్ లో స్టఫ్ మాత్రం చాలా ఉంటుంది. ఎలాంటి కథ అయినా.. ఎలాంటి పాత్ర అయినా సరే ఇట్టే పరకాయ ప్రవేశం చేసి మెప్పిస్తాడు. ఈమధ్యనే ధనుష్ నటిస్తూ డైరెక్ట్ చేసిన రాయన్ సినిమా రిలీజైంది. సినిమా మొదటి షో అంత గొప్పగా రాకపోయినా చిన్నగా సినిమా సక్సెస్ రూట్ లోకి వెళ్లింది.

రొటీన్ కథే కానీ ధనుష్ డైరెక్షన్ రెహమాన్ మ్యూజిక్ సినిమాను నిలబెట్టాయని చెప్పుకుంటున్నారు. ఐతే ఈ సినిమా గురించి సూపర్ స్టార్ మహేష్ సర్ ప్రైజ్ ట్వీట్ చేశారు. రాయన్ సినిమా బాగుందంటూ టీం అందరికీ కంగ్రాట్స్ చెప్పిన మహేష్ మస్ట్ వాచ్ అంటూ కామెంట్ పెట్టాడు. ఐతే ధనుష్ సినిమా మహేష్ కావాలని చూశాడా లేక సినిమా బాగుందన్న టాక్ తన దాకా రావడంతో చూశాడా అన్నది తెలియదు కానీ.. మహేష్ సినిమా చూసి నచ్చితే మాత్రం కచ్చితంగా దాని గురించి ఒక ట్వీట్ చేస్తాడు.

ఐతే ధనుష్ రాయన్ సినిమాను మహేష్ పొగుడుతూ ట్వీట్ చేయడం దానికి ధనుష్ థాంక్స్ చెప్పడం ఇదంతా చూసిన సినీ లవర్స్ ధనుష్ డైరెక్షన్ లో మహేష్ హీరోగా సినిమా వస్తే ఎలా ఉంటుందని చర్చిస్తున్నారు. మహేష్ లాంటి హీరోకి ధనుష్ కథ సిద్ధం చేస్తే ఈ కాంబో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. హీరో డైరెక్టర్ అయితే సినిమాలో ప్రతి అంశం మీద టచ్ ఉంటుంది. సింగర్, కంపోజర్, ప్రొడ్యూసర్ ఇప్పుడు డైరెక్టర్ ఇలా ధనుష్ మల్టీ టాలెంట్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.

ఐతే ధనుష్ డైరెక్షన్ లో మహేష్ సినిమా ఉండే ఛాన్స్ ఉంటుందా అంటే ఏమో ఫ్యూచర్ లో ఏమైనా జరగొచ్చు.. ప్రస్తుతం అయితే మహేష్ రాజమౌళి తో చేసే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. మహేష్ 29వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అంచనాలు తారాస్థాయిలో ఉండగా సినిమా గురించి రాజమౌళి అండ్ టీం ఎప్పుడు ప్రెస్ మీట్ పెడుతుందా అని ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.