Begin typing your search above and press return to search.

జూన్‌ లోనూ ఆ 50వ సినిమా కష్టమే..!

ధనుష్‌ కెరీర్‌ లో 50వ సినిమా అయిన రాయన్ ను భారీ ఎత్తున పాన్ ఇండియా రేంజ్ లో జూన్‌ 13న విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.

By:  Tupaki Desk   |   28 May 2024 12:09 PM GMT
జూన్‌ లోనూ ఆ 50వ సినిమా కష్టమే..!
X

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న 'రాయన్‌' సినిమా విడుదల విషయంలో గందరగోళం నెలకొంది. ధనుష్‌ కెరీర్‌ లో 50వ సినిమా అయిన రాయన్ ను భారీ ఎత్తున పాన్ ఇండియా రేంజ్ లో జూన్‌ 13న విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. కానీ అది సాధ్యం అయ్యేలా లేదు.

జూన్ లో విడుదల చేయాలని మేకర్స్ బలంగా ప్రయత్నాలు చేశారు. ఆ మధ్య ఒక పాటను కూడా విడుదల చేయడం జరిగింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో జూన్‌ 13న రాయన్ సినిమాను విడుదల చేయడం లేదని తమిళ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఆ మధ్య ప్రమోషన్ హడావుడి చేసిన యూనిట్‌ సభ్యులు విడుదల తేదీ కి మరో రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉన్నా కూడా ప్రమోషన్‌ కార్యక్రమాలు చేయడం లేదు. దాంతో సినిమా ను జులై లేదా ఆగస్టు కు వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి అంటూ తమిళ మీడియా సర్కిల్స్‌ లో టాక్‌ వినిపిస్తుంది.

గత రెండు నెలలుగా పొలిటికల్‌ హడావుడి మరియు ఐపీఎల్‌ ఇంకా ఎండల కారణంగా పెద్ద సినిమాలు ఏవీ కూడా రాలేదు. జూన్ లో ధనుష్ సినిమా వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలేలా ఉంది. ధనుష్ 50వ సినిమా అవ్వడంతో పాటు ఆయనే దర్శకుడు అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ సినిమాలో దర్శకుడు ఎస్‌జే సూర్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇంకా సందీప్ కిషన్‌, సెల్వ రాఘవన్‌, ప్రకాష్ రాజ్‌, అపర్ణ బాల మురళి, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, దుషార విజయన్‌ లు కీలక పాత్రలో నటించారు. ఏఆర్‌ రహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. కొత్త విడుదల తేదీ పై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.