Begin typing your search above and press return to search.

సాయి ప‌ల్ల‌వి కోసం రొమాంటిక్ ప్రొడ్యూస‌ర్ ట్ర‌య‌ల్స్!

సాయి ప‌ల్ల‌వి రెండ‌వ సినిమా ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లోనే చేయాలి అనే ప‌ట్టుతో క‌ర‌ణ్ జోహార్ మంత‌నాలు చేస్తున్నాడుట‌. ఆ సంస్థ‌లో తాను ఏ సినిమా చేస్తుంది?

By:  Tupaki Desk   |   18 Feb 2025 2:45 AM GMT
సాయి ప‌ల్ల‌వి కోసం రొమాంటిక్ ప్రొడ్యూస‌ర్ ట్ర‌య‌ల్స్!
X

బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్ల‌వి 'రామాయ‌ణం' సినిమాతో బాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఏకంగా సీత పాత్ర‌తోనే హిందీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెడుతుంది. అమ్మ‌డి కెరీర్ లో నే బెస్ట్ లాంచింగ్ మూవీగా భావిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే? సీత పాత్ర‌కు వ‌చ్చే గుర్తింపు బాలీవుడ్ చ‌రిత్ర‌లో నిలిచి పోతుంది. సాయిప‌ల్ల‌వి గొప్ప పెర్పార్మ‌ర్. అందులో ఎలాంటి డౌట్ లేదు.

అందుకే నితీశ్ తివారీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అంద‌ర్నీ ప‌క్క‌న బెట్టి మ‌రీ సాయి ప‌ల్ల‌విని ఎంపిక చేసాడు. సాధార‌ణంగా సాయి ప‌ల్ల‌విని ఏ పాత్ర‌కైనా ఒప్పించ‌డ అంత సుల‌భం కాద‌ని ఇటీవ‌లే చందు మొండేటి మాట‌ల్లో అర్దమైంది. కానీ నితీష్ తివారీ సీత పాత్ర‌కు మాత్రం ఈజీగానే క‌న్విన్స్ అయింది. ఇలాంటి పాత్ర‌ల్లో న‌టించే అవ‌కాశం ఎవ‌రికో వ‌రించదు. ఇప్పుడా ఛాన్స్ సాయి ప‌ల్ల‌వికి రావ‌డం ఓ ర‌కంగా ల‌క్కీ అనే చెప్పాలి.

మ‌రి ఈ సినిమా త‌ర్వాత బాలీవుడ్ లో కొన‌సాగుతుందా? లేదా? అన్న‌ది తెలియ‌దు గానీ...సాయి ప‌ల్ల‌వి కోసం మాత్రం అప్పుడే క‌ర‌ణ్ జోహార్ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టినట్లు బాలీవుడ్ మీడియాలో క‌థ‌నా లొస్తున్నాయి. సాయి ప‌ల్ల‌వి రెండ‌వ సినిమా ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లోనే చేయాలి అనే ప‌ట్టుతో క‌ర‌ణ్ జోహార్ మంత‌నాలు చేస్తున్నాడుట‌. ఆ సంస్థ‌లో తాను ఏ సినిమా చేస్తుంది? అన్న‌ది త‌ర్వాత సంగ‌తి ముందుగా ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో అగ్రిమెంట్ చేసుకునేలా ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

కానీ అదంత ఈజీ కాదు. సాయి ప‌ల్ల‌విని ఒప్పించ‌డం ద‌ర్శ‌కుల‌కే చేత కాక చేతులెత్తేసిన వారెంతో మంది. న‌టిగా త‌న‌కంటూ కొన్ని ప‌రిమితుల‌తో కొన‌సాగుతుంది. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు....రొమాంటిక్ స‌న్నివేశాల‌కు సాయి ప‌ల్ల‌వి దూరంగా ఉంటుంది. ఎన్ని కోట్లు ఆఫ‌ర్ చేసినా? ఆమె నోట ఎస్ అని చెప్పించ‌డం అసాధ్యం. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బాలీవుడ్ లో బిగ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ లో ఒక‌టైనా? క‌ర‌ణ్ జోహార్ పై రొమాంటిక్ ప్రొడ్యూస‌ర్ ముద్ర ఉంది. ఇలాంటి కార‌ణాల‌న్నీ సాయి ప‌ల్ల‌విని వెన‌క్కి లాగే అవ‌కాశం ఉంది.