Begin typing your search above and press return to search.

పిచ్చిగా ప్రేమించిన డ్రీమ్ గ‌ర్ల్ కోసం స్టార్ హీరో సాహ‌సాలు!

తన భర్తను పెళ్లి చేసుకున్నందుకు ధర్మేంద్ర మొదటి భార్య కౌర్ చాలా సీరియ‌స్ అయ్యారు.

By:  Tupaki Desk   |   2 May 2024 4:30 PM GMT
పిచ్చిగా ప్రేమించిన డ్రీమ్ గ‌ర్ల్ కోసం స్టార్ హీరో సాహ‌సాలు!
X

బాలీవుడ్ లెజెండ్ ధ‌ర్మేంద్ర‌- డ్రీమ్ గర్ల్ హేమ‌మాలిని వివాహం జరిగి 44 సంవత్సరాలు అయ్యింది. ఈ రోజు ఈ జంట 44వ పెళ్లి రోజు వేడుక‌ల్ని జ‌రుపుకున్నారు. నిజానికి ధ‌ర్మేంద్ర‌కు అప్ప‌టికే పెళ్ల‌యినా కానీ అత‌డిని హేమ‌మాలిని పెళ్లి చేసుకోవ‌డం నాటిరోజుల్లో చ‌ర్చ‌గా మారింద‌ని హిందీ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ హేమమాలినితో అతడి రెండవ వివాహం గురించి అసంతృప్తిని వ్యక్తం చేసారని హిందీ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. అంతేకాదు కౌర్ త‌న భ‌ర్త రెండో వివాహాన్ని అంగీకరించడానికి కూడా నిరాకరించింది. నటుడు ధ‌ర్మేంద్ర‌ తన డ్రీమ్ గర్ల్‌ను వివాహం చేసుకోవడానికి ఇస్లాం మతం తీసుకున్నారు. ధర్మేంద్ర హేమను పిచ్చిగా ఘాఢంగా ప్రేమించారు. అత‌డు ఆమెను వివాహం చేసుకోవడానికి ప్రపంచాన్ని వ్యతిరేకించాడు. ఒక ర‌కంగా ధ‌ర్మేంద్ర సాహ‌సం చేసార‌ని ప్ర‌జ‌ల్లో చ‌ర్చ సాగింది.

తన భర్తను పెళ్లి చేసుకున్నందుకు ధర్మేంద్ర మొదటి భార్య కౌర్ చాలా సీరియ‌స్ అయ్యారు. హేమ మాలినిని ఆమె దూషించారు. ఒక ఇంటర్వ్యూలో ప్రకాష్ కౌర్ మాట్లాడుతూ, హేమ తన జీవితాల్లోకి ప్ర‌వేశించ‌డం స‌రికాద‌ని.. వివాహితుడు.. పిల్లలు ఉన్న వ్య‌క్తిని సొంతం చేసుకోవడానికి ప్ర‌య‌త్నించింద‌ని ఆవేద‌న చెందిన‌ట్టు తాజాగా బాలీవుడ్ లైఫ్ డాట్ కాం ఒక క‌థ‌నంలో పేర్కొంది. బాలీవుడ్ స్టార్ జీతేంద్రతో హేమమాలిని వివాహం విచ్చిన్నం కావ‌డానికి ధ‌ర్మేంద్ర కార‌కుడ‌య్యారని... హేమ ప్రముఖ నటుడు జీతేంద్రను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా కానీ ధర్మేంద్ర తన డ్రీమ్ గర్ల్‌ను విడిచిపెట్టలేదని కూడా క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి.

సన్నీ డియోల్ తన తండ్రి ధర్మేంద్రను పెళ్లి చేసుకున్న న‌టి హేమమాలినిని ప‌గ‌ప‌ట్టార‌ని కూడా ప్ర‌చార‌మైంది. ఓ పార్టీలో హేమమాలినిపై దాదాపు తుపాకీ గురిపెట్టినట్లు మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. అయితే, ప్రకాష్ కౌర్ ఈ పుకార్లను కొట్టిపారేసారు. తన కొడుకు అలాంటి పెంపకంలో పెర‌గ‌లేదని వ్యాఖ్యానించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అలాగే హేమ మాలిని, ఆమె కుటుంబంతో సన్నీ డియోల్ ఎప్పుడూ సంబంధాన్ని కొనసాగించలేదన్న ప్ర‌చారం కూడా ఉంది. సన్నీ డియోల్- హేమతో తన తండ్రి ధర్మేంద్ర రెండవ వివాహం విష‌యంలో ఎప్పుడూ అసంతృప్తిగా ఉన్నాడు. అందువల్ల అతడు ఆ ఇద్ద‌రితోను ఎటువంటి సంబంధం లేకుండా దూరంగా ఉన్నాడు. గదర్ 2 సక్సెస్ సందర్భంగా గతేడాది అవ‌న్నీ మ‌ర్చిపోయి స‌న్నీడియోలో అంద‌రితో క‌లిసిపోయార‌ని కూడా బాలీవుడ్ లైఫ్ త‌న క‌థ‌నంలో పేర్కొంది.

భ‌ర్త‌తో జీవించ‌లేదు:

హేమ‌మాలిని ఇంత‌కుముందు ఒక ఇంటర్వ్యూలలో తాను తన భర్త ధర్మేంద్రతో కలిసి జీవించడం లేదని, ఎవరూ అలా ఉండాలని కోరుకోరని అన్నారు. అది త‌న‌కు తానుగా తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని తెలిపారు. ఎవరికీ తమ జీవితాన్ని ఇలా గడపాలని అనిపించదు. ప్రతి స్త్రీ ఒక సాధారణ కుటుంబంలా భర్త, పిల్లలు కావాలని కోరుకుంటుంది. కానీ ఎక్కడో అది దారి తప్పింది.. అని ఆవేద‌న చెందిన‌ట్టు హిందీ మీడియా పేర్కొంది.

కూతురు నటి కావడం ఇష్టం లేదట

తన కుమార్తె ఈషా డియోల్ బాలీవుడ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడంతో ధర్మేంద్ర అంత సంతోషంగా లేర‌ని హేమ మాలిని ఒక సంద‌ర్భంలో మీడియాకు వెల్ల‌డించారు. కెరీర్ ఎంపిక‌లో త‌న తండ్రికి వ్యతిరేకంగా వెళ్లింది ఈషా. ధ‌ర్మేంద్ర‌కు అది అస్స‌లు న‌చ్చ‌లేదు. ఈషా డియోల్ భ‌రత్ త‌ఖ్తానీని పెళ్లాడారు. పెళ్లి త‌ర్వాత‌ న‌ట‌న‌ను విర‌మించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే త‌న భ‌ర్త నుంచి ఈషా విడాకులు తీసుకున్నారు.