Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో చేతిపై ధోనీ పేరు టాటూ

భాషతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా టీం ఇండియా మాజీ క్రికెటర్ ధోనీ ని అభిమానించే వారు కోట్లలో ఉంటారు.

By:  Tupaki Desk   |   30 Aug 2024 12:30 AM GMT
స్టార్‌ హీరో చేతిపై ధోనీ పేరు టాటూ
X

భాషతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా టీం ఇండియా మాజీ క్రికెటర్ ధోనీ ని అభిమానించే వారు కోట్లలో ఉంటారు. అంతర్జాతీయ స్థాయిలో ఆటకు గుడ్‌ బై చెప్పినా కూడా ధోనీ ఐపీఎల్‌ లో కొనసాగుతున్నాడు. సుదీర్ఘ కాలంగా చెన్నై సూపర్‌ కింగ్స్ కి ఎన్నో విజయాలను అందించిన ధోనీ అంటే తమిళనాడు సినీ మరియు క్రికెట్‌ అభిమానులకు ప్రత్యేక అభిమానం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ధోనీ కూడా తనకు తమిళనాడు అంటే చాలా స్పెషల్‌ అంటూ పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

తాజాగా ఒక తమిళ్‌ స్టార్‌ హీరో తన చేతిపై ధోనీ పేరును టాటూగా వేయించుకోవడం, ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్ అవ్వడం చర్చనీయాంశం అయ్యింది. ఆ స్టార్‌ హీరో మరెవ్వరో కాదు కార్తీ. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్‌ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న కార్తీ త్వరలో 'మెయ్యళగన్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాలో తమిళ్ సీనియర్‌ స్టార్‌ నటుడు అరవింద్‌ స్వామి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కార్తీ, అరవింద్‌ స్వామి ల కాంబో సన్నివేశాలు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసే విధంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.

'96' సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకుని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు సి ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మెయ్యళగన్ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ధోనీకి వీరాభిమానిగా కార్తీ కనిపించబోతున్నాడు. సినిమా లో భాగంగా కార్తీ చేతిపై ధోనీ పేరు టాటూ కూడా ఉండబోతుంది. కార్తీ చేతి పై ఉన్న టాటూ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ధోనీ ఫ్యాన్స్ తో పాటు కార్తీ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సూర్య, జ్యోతిక లు నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీదివ్య, స్వాతి కొండే, దేవ దర్శిని, జయప్రకాష్‌, రాజ్‌ కిరణ్ లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. గోవింద్‌ వసంత సంగీతం అందిస్తూ ఉండగా, మహేంద్రన్‌ జయరాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్‌ చివరి వారంంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యిందని, మరో వైపు పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. తమిళ్‌ తో పాటు తెలుగు లో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కాబోతుంది.