Begin typing your search above and press return to search.

42 డీల్స్‌తో బిగ్ బి SRKలను మించి

అతడి ఎండార్స్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో సిట్రోయెన్, గరుడ ఏరోస్పేస్, పెప్సికో వంటి అగ్ర బ్రాండ్‌లు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   5 Dec 2024 11:30 PM GMT
42 డీల్స్‌తో బిగ్ బి SRKలను మించి
X

కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని ఇటీవ‌ల ఏం చేసినా అది సంచ‌ల‌నంగానే మారుతోంది. ఇప్పటికీ బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ రంగంలో అత‌డు హాట్ ప్రాపర్టీ. ఒకటి కాదు.. రెండు కాదు.. 2024లో కేవ‌లం ఆరు నెల‌ల్లో ఏకంగా 42 భారీ డీల్స్‌ని కుదుర్చుకున్నాడు ఎం.ఎస్.ధోని. బ్రాండ్స్ ప్రచారంలో త‌న‌ను కొట్టేవాళ్లే లేర‌ని నిరూపించాడు ఈ క్రికెట‌ర్. బిగ్ B అమితాబ్.. కింగ్ ఖాన్ షారూఖ్‌ని సైతం వెన‌క్కి నెట్టి బ్రాండ్ ఎండార్స్‌మెంట్ స్పేస్‌లో ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు ధోని. షారూఖ్ ఖాన్ , అమితాబ్ బచ్చన్ వంటి లీడింగ్ స్టార్‌లను ధోని అధిగమించారు. అతడి ఎండార్స్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో సిట్రోయెన్, గరుడ ఏరోస్పేస్, పెప్సికో వంటి అగ్ర బ్రాండ్‌లు ఉన్నాయి.


TAM మీడియా రీసెర్చ్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం... లగ్జరీ కార్ల నుండి పౌర మౌలిక సదుపాయాల వరకు, ధోని అన్ని పెద్ద కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా కొన‌సాగుతున్నారు. ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యంలోని క్లియర్‌ట్రిప్, పెప్సికోస్ లేస్, ఇమోటోరాడ్, మాస్టర్ కార్డ్, గల్ఫ్ ఆయిల్, ఓరియంట్ ఎలక్ట్రిక్ వంటి ప్రముఖ బ్రాండ్‌లు ఉన్నాయి. యూరోగ్రిప్ టైర్స్ తో అతడి స్నేహం సహకారం రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్‌లో అగ్ర బ్రాండ్ అంబాసిడర్‌గా అతడి స్థానాన్ని మరింత సుస్థిరం చేసింది.

కేవ‌లం వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ప్ర‌చారంలోనే కాదు.. ధోని పౌర సేవా కార్యక్రమాలకు కూడా బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నాడు. ఇటీవల ముగిసిన జార్ఖండ్ ఎన్నికల సమయంలో ప్రజలను బూత్ కి వచ్చి ఓటు వేయమని ప్రోత్సహించడానికి ధోనీ ఎన్నికల కమిషన్‌తో కలిసి పనిచేశాడు.

రోజువారీ స్క్రీన్ ప్రెజెన్స్‌లో అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వంటి నటుల కంటే వెనుకబడి ఉన్నాకానీ..బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లలో ధోని అద్భుతమైన వృద్ధిని TAM క‌థ‌నం హైలైట్ చేసింది. కుమార్, ఖాన్, బచ్చన్ రోజుకు సగటున 22, 20, 16 గంటల స్క్రీన్ టైమ్ తీసుకుంటుండగా, ధోని 14 గంటలు స్క్రీన్ టైమ్ ని క‌లిగి ఉన్నాడు. ప్ర‌శాంత‌మైన‌వాడు న‌మ్మ‌ద‌గిన‌వాడిగా బ్రాండ్లు ధోనీని గుర్తించాయి. అందుకే ఈ అవ‌కాశాలు అంటూ ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

ధోని అంటే దేశవ్యాప్తంగా అభిమానం ఉంది. చెన్నైలో అతడిని త‌ళా అని పిలుస్తారు. త‌ళ అంటే విన‌యం.. ఇత‌రుల‌ను గౌర‌వించే మంచిత‌నం..భారతదేశంలో ఈ గుణాలు అత‌డిని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎదిగేందుకు స‌హ‌క‌రించాయ‌ని భారత క్రికెట్ జట్టు మాజీ మీడియా మేనేజర్ ఆర్ ఎన్ బాబా అన్నారు.

ఓ క‌థ‌నం ప్రకారం 2024లో ఐపిఎల్ ఫ్రాంచైజీలలో సీఎస్.కే ది బెస్ట్ గా నిలిచింది. ఫ్రాంచైజీ 231 మిలియన్ డాల‌ర్ల నిక‌ర సంప‌ద‌తో ఉన్నందున CSKతో ధోని అనుబంధం అతని బ్రాండ్ అప్పీల్‌ను మరింత పెంచింది. ధోని CSK కి ముఖ‌చిత్రంగా ఉన్నాడు. అగ్రశ్రేణి స్పాన్సర్‌లను ఆకర్షించాడు. టీమ్ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కొనసాగించాడు అని నివేదిక పేర్కొంది.

CSK అభిమానుల వ్యూహాలు, కమ్యూనిటీ కార్యక్రమాలు.. బ్రాండింగ్ విజయాలు ధోని అపారమైన ప్రజాదరణకు స‌హ‌క‌రించాయి. ఇది IPL ర్యాంకింగ్స్‌లో తన ఆధిపత్య స్థానాన్ని పదిలపరచుకోవడం ద్వారా స్థిరంగా అధిక స్పాన్సర్‌షిప్ ఆదాయాలను పొందేందుకు ఫ్రాంచైజీని ఎనేబుల్ చేసింది.