LGM ఎఫెక్ట్.. ఇక ధోనీని యోగిబాబే ఆదుకోవాలి
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీకి దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్‌లో ఉందో తెలిసిందే. మరీ ముఖ్యంగా తమిళనాడులో భారీ స్థాయిలో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఐపీఎల్ సీఎస్కే కెప్టెన్‌గా తన ఆటతో అక్కడివారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
By: Tupaki Desk | 30 July 2023 6:37 AM GMTటీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీకి దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్‌లో ఉందో తెలిసిందే. మరీ ముఖ్యంగా తమిళనాడులో భారీ స్థాయిలో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఐపీఎల్ సీఎస్కే కెప్టెన్‌గా తన ఆటతో అక్కడివారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ క్రేజ్‌ను వినియోగించుకుని.. ఆయన ఇటీవలే ధోనీ ఎంటర్టైన్మెంట్ అనే సినిమా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ సంస్థలో రూపొందిన తొలి చిత్రం 'లెట్స్ గెట్ మ్యారీడ్'. తమిళ ప్రేక్షకులనే మెయిన్ టార్గెట్ చేసుకుంటూ.. తమిళ నటులతోనే ఈ సినిమాను రూపొందించారు. రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్.. మరీ ముఖ్యంగా ధోనీ ప్రొడ్యూస్ చేయడంతో సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అలా ఈ చిత్రం జులై 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తాజాగా అందిన సమాచాం ప్రకారం ఈ సినిమా తమిళ తంబీలకు అంతగా ఆకట్టుకోలేదని తెలుస్తోంది.
సోషల్‌మీడియాలో వస్తున్న రివ్యూల ప్రకారం.. సినిమా ఔట్పుట్ ఆడియెన్స్‌ను ఎక్కువగా ఆకట్టుకోలేకపోయిందట. కొన్ని చోట్లు మిక్స్డ్ రివ్యూలు కూడా వస్తున్నాయి. కథ, స్క్రీన్‌ప్లే యావరేజ్‌గా ఉన్నాయని అంటున్నారు. కేవలం సినిమాలో యోగిబాబు కామెడీ పెర్ఫార్మెన్సే హైలైట్‌గా ఉందట. కేవలం అతని నటనపైనే సినిమా ఆధారపడి ఉందని తెలిసింది.
దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను అందుకుంటుందోనని అంతా మాట్లాడుకుంటున్నారు. లాభాలు సంగతి పక్కనపెడితే కనీసం పెట్టుబడైనా ధోనీకి వస్తుందా అని అంటున్నారు. ఇక ఈ సినిమా గట్టెక్కాలంటే.. యోగిబాబు నటన కోసమే ప్రేక్షకులు థియేటర్లకు రావాలని అభిప్రాయపడుతున్నారు.
కాగా, ఈ సినిమాలో.. హరీశ్ కల్యాణ్, 'లవ్‌టుడే' ఫేమ్ ఇవానా జంటగా నటించారు. నదియా, యోగిబాబు, ఆర్.జె. విజయ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. అత్తాకోడళ్ల మధ్య జరిగే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. దీన్ని రమేశ్ తమిళమణి డైరెక్ట్ చేశారు. ఈ దర్శకుడు గతేడాది.. ధోనీ ప్రధాన పాత్రలో 'అథర్వ ది ఆరిజిన్' అనే వెబ్‌సిరీస్ కూడా ప్రకటించారు. సైంటిఫిక్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే నవల 'అథర్వ ది ఆరిజిన్' ఆధారంగా దీన్ని గ్రాఫిక్స్ రూపంలో తెరకెక్కిస్తున్నట్టు పేర్కొన్నారు.