Begin typing your search above and press return to search.

ధూం ధాం.. "మాయా సుందరి"

చేతన్ కృష్ణ, హెబా పటేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న "ధూం ధాం.." చిత్రం శరవేగంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది

By:  Tupaki Desk   |   20 Jun 2024 11:20 AM GMT
ధూం ధాం.. మాయా సుందరి
X

చేతన్ కృష్ణ, హెబా పటేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న "ధూం ధాం.." చిత్రం శరవేగంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎం.ఎస్. రామ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ వంటి ప్రతిభావంతమైన నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సాయి కిషోర్ మాచా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, గొప్ప కథ మరియు స్క్రీన్ ప్లే రచయిత గోపీ మోహన్ అందించారు. ఈ చిత్రం ఒక ఎంగేజింగ్ లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కోసం సిద్దమవుతోంది. ప్రమోషన్లలో చిత్ర బృందం బిజీగా ఉంది.

ఇటీవల, "ధూం ధాం.." చిత్రం నుంచి "మాయా సుందరి" అనే రెండవ సింగిల్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మెలోడీ, విడుదలైన వెంటనే చార్ట్‌బస్టర్ గా మారిపోయింది. ఎనర్జిటిక్ బీట్స్, అందమైన విజువల్స్, చేతన్ కృష్ణ యొక్క సింపుల్ స్టెప్స్ ఈ గీతాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. చేతన్ మరియు హెబా క్యూట్ కెమిస్ట్రీ ఈ మెలోడీని మరింత ఆకర్షణీయంగా చేసింది.

సెన్సేషనల్ సింగర్ అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్ వోకల్స్, గోపి సుందర్ స్వరపరిచిన స్వీట్ ట్యూన్ ఈ పాటను మేజికల్ గా మార్చాయి. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన కవితా సాహిత్యం, ఈ మెలోడీని మరింత అందంగా తీర్చిదిద్దింది. చేతన్ కృష్ణ, హెబా పటేల్ మీద తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఈ పాటను చక్కగా ఆలపించారు.

"దుమ్ము ధాం" చిత్రం సాంగ్స్, టీజర్, ట్రైలర్ విడుదల చేస్తూ చిత్ర బృందం ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. చేతన్ కృష్ణ మరియు హెబా పటేల్ జంటగా నటించిన ఈ చిత్రం, వారి కెమిస్ట్రీతో ప్రేక్షకులను అలరించనుంది. సినిమాటోగ్రఫీ, సంగీతం, కథ, నటీనటుల ప్రతిభ కలగలిసి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించనుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

నటుడు చేతన్ కృష్ణ ఇప్పటివరకు చేసిన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. ఇక ఇప్పుడు "ధూమ్ ధాం"తో మరొక కొత్త ప్రయోగం చేయడానికి సిద్ధమయ్యాడు. గతంలో "గల్ఫ్," "ఫస్ట్ ర్యాంక్ రాజు," "బీచ్ రోడ్ చేతన్," మరియు "రోజులు మారాయి" వంటి చిత్రాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందిన చేతన్, ఈసారి సరికొత్త కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు.