Begin typing your search above and press return to search.

ధూం ధాం టీజర్.. పక్కా ఫ్యామిలీ బొమ్మ!

టీజర్ లో ప్రేమ, కామెడీ, లవ్, ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. హీరో చేతన్ కృష్ణ ఇప్పటికే విభిన్నమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   12 Aug 2024 9:09 AM GMT
ధూం ధాం టీజర్.. పక్కా ఫ్యామిలీ బొమ్మ!
X

సెన్సేషనల్ సాంగ్స్ తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న "ధూం ధాం" మూవీ తాజాగా టీజర్ తో మరింతగా ఆకట్టుకుంటోంది. హీరో చేతన్ కృష్ణ, హీరోయిన్ హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాని ఎం.ఎస్. రామ్ కుమార్ తన ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ కూడా ఆడియెన్స్ ల్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది.

ఇక ఇటీవల జరిగిన ఈవెంట్ లో టాలీవుడ్ మాస్ మాచో స్టార్ గోపిచంద్ మరియు సీనియర్ దర్శకుడు శ్రీను వైట్ల "ధూం ధాం" టీజర్ ను విడుదల చేశారు. వారు ఈ సందర్బంగా సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. టీజర్ చూసి సినిమాలోని వినోదం, కమర్షియల్ ఎలిమెంట్స్ ఎంతో ఆకట్టుకుంటాయని వారు ప్రశంసలు కురిపించారు. ప్రతీ ఫ్రేమ్ కూడా అన్ని వర్గాల ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉందని అన్నారు.

టీజర్ లోని విజువల్స్, కామెడీ సన్నివేశాలు సినిమా పై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రేమ, కుటుంబ విలువలను ప్రధానాంశంగా తీసుకుని రూపొందించిన ఈ సినిమా సర్వత్రా ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా ఉందని తెలుస్తోంది. టీజర్ లోని ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమాలు ఈమధ్య చాలా తక్కువగా వస్తున్నాయి. ఇక ఇప్పుడు "ధూం ధాం" ఆ కోరుకను తీర్చే అవకాశం ఉందని అర్ధమవుతుంది.

టీజర్ లో ప్రేమ, కామెడీ, లవ్, ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. హీరో చేతన్ కృష్ణ ఇప్పటికే విభిన్నమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ఇక ఈ సినిమాలో అతని లుక్స్ టైమింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. హీరోయిన్ హెబ్బాతో హీరో కెమిస్ట్రీ కూడా బాగానే హైలెట్ అవుతోంది.

ఈ సినిమాకి గోపి మోహన్ కథ, స్క్రీన్ ప్లే అందించగా, సాయి కిషోర్ మాచా దర్శకత్వం వహించారు. ఇక సాయి కుమార్, వెన్నెల కిశోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు "మల్లెపూల టాక్సీ," "మాయా సుందరి," "టమాటో బుగ్గల పిల్ల," "కుందనాల బొమ్మ" లాంటి పాటలు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాయి.

ఇటీవలే విడుదలైన ఈ టీజర్ సినిమాకు సంబంధించి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. “ధూం ధాం” సినిమా సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. సమీపంలో ఉన్న థియేటర్ లో ప్రేమ, కుటుంబ కథా చిత్రాలను ఆస్వాదించే వారందరికీ ఈ చిత్రం పక్కా ఎంటర్టైనర్ గా నిలిచే అవకాశముంది.