చై ఇలా నటించడం ఆశ్చర్యంగా ఉంది: నాగార్జున
అక్కినేని నాగచైతన్య ఓటీటీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అతడు నటించిన `దూత` అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది
By: Tupaki Desk | 2 Dec 2023 3:21 PM GMTఅక్కినేని నాగచైతన్య ఓటీటీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అతడు నటించిన 'దూత' అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో తాజా వెబ్ సిరీస్ ఇది. 01 డిసెంబర్ 2023న దూత విడుదలైంది. మనం ఫేం విక్రమ్ కె.కుమార్ ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించారు.
దూత అంటే ఆంగ్లంలో మెసెంజర్ అని అర్థం. ఈ సిరీస్ లో నాగ చైతన్య జర్నలిస్ట్ పాత్రలో నటించారు. ఒక జర్నలిస్టుగా కథానాయకుడు జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటాడు. ప్రతిదీ వార్తాపత్రిక ద్వారా కనెక్ట్ అయి సన్నివేశాలు రన్ అవుతాయి. దూతలో మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రతి భాగం అద్భుతమైన టింజ్‌తో ముగుస్తుంది. సబ్జెక్ట్ చాలా కంటెంట్‌తో అలరిస్తోంది. నిజానికి దూత సిరీస్ ని ఇరవై ఎపిసోడ్‌ల వరకు తీయగలం అని ఇంతకుముందు విక్రమ్ కె అన్నారు. మొదట్లో దీనిని సినిమా తీయాలని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. OTT బూమ్ వచ్చినప్పటి నుండి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అతీంద్రియ శక్తుల నేపథ్యంతో ఒక సినిమాను రూపొందించాలని విక్రమ్ కె భావించారు. కానీ చైతన్యకు హారర్ కథ కంటే దూత కథ నచ్చిందని విక్రమ్ కె తెలిపారు.
హైదరాబాద్‌లో నిన్న దూత ప్రీమియర్ జరిగింది. అనంతరం సెలబ్రిటీలు నాగచైతన్య నటనను ప్రశంసించారు. ఇప్పుడు కింగ్ నాగార్జున కూడా దూతలో చైతన్య నటనకు ఆశ్చర్యపోయానని, తనను ఇలా చూడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి భిన్నంగా నటించాడని, గత రాత్రి సిరీస్ ని చూసి ఎగ్జయిట్ అయ్యానని కూడా కింగ్ అన్నారు. సోషల్ మీడియాలో కింగ్ నాగార్జున ప్రశంసలు దూతకు మైలేజ్ ని పెంచుతాయనడంలో సందేహం లేదు.
దూత ఎలా మొదలైంది అంటే.. విక్రమ్ కె 'మనం' సినిమా చేస్తున్నప్పుడు చైతన్యకు ఒక కథను చెప్పారు. కానీ చై హారర్ థ్రిల్లర్ చేయడానికి ఆసక్తి చూపలేదు. కానీ ధూత కథను చెప్పిన క్షణం చై తన పాత్రను ఇష్టపడ్డాడు. వెంటనే ప్రాజెక్ట్ ఓకే అయిందని దర్శకుడు వెల్లడించారు.
నాగ చైతన్య తన కెరీర్‌లో తొలిసారి చాలా ఇంటెన్స్ పాత్రలో కనిపించాడు. ఇదే విషయం గురించి అడిగినప్పుడు విక్రమ్ కె కుమార్ స్పందిస్తూ.. చై చాలా తక్కువ అంచనా కలిగి ఉన్న పాత్రలో, గ్రే షేడ్స్ ఉన్న జర్నలిస్ట్‌గా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. చైతన్య తండ్రి నాగార్జున తన నటనను ఇష్టపడ్డారు . అలాంటి కొత్త కోణంలో చైతూని ప్రదర్శించినందుకు నన్ను ప్రశంసించారు అని చెప్పాడు. దూతలో ప్రముఖ కథానాయికలు పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషించారు.