240 దేశాల్లో..38 భాషల్లో సబ్ టైటిల్స్ తో!
ఓటీటీ అందుబాటులోకి వచ్చాక సినిమా కంటెంట్ కి హద్దులనేవి పూర్తిగా చెరిగి పోయాయి. దేశాలు.. ఖండాలు దాటిపోతున్నాయి.
By: Tupaki Desk | 7 Dec 2023 7:04 AM GMTఓటీటీ అందుబాటులోకి వచ్చాక సినిమా కంటెంట్ కి హద్దులనేవి పూర్తిగా చెరిగి పోయాయి. దేశాలు.. ఖండాలు దాటిపోతున్నాయి. ప్రపంచ భాషల్లో సినిమా అందుబాటులో ఉంటుంది. ఏ భాషలో కావాలంటే ఆ భాషలో సబ్ టైటిల్స్ రూపంలో ఎంటర్ టైగన్ మెంట్ దొరుకుతుంది. తాజాగా ఇటీవలే నాగచైతన్య నటించిన `దూత` వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి `దూత` ఎన్నిదే శాల్లో? ఎన్ని భాషల్లో అందుబాటులో ఉందో? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఓ తెలుగు వెబ్ సిరీస్ ఇన్ని భాష ల్లో అడుతుందా? అని సర్ ప్రైజ్ అవ్వడం ఖాయం. ఈ విషయాన్ని నిర్మాత శరత్ మరార్ రివీల్ చేసారు. 240 దేశాల్లో..38 భాషల్లో సబ్ టైటిల్స్ తో సిరీస్ ప్రదర్శితమవుతోంది.
నటులకు కానీ.. దర్శకనిర్మాతలకు కానీ వాళ్లు చేసిన పని ఇంత విస్తృతమైన ఫరిదిలో ప్రేక్షకులకు చేరువ కావడం..నాగచైతన్యని ఇలాంటి పాత్రలో చూడటం కొత్తగాఉందనే ప్రశంసలు లభిస్తున్నాయని` శరత్ మారర్ తెలిపారు. ఇన్ని దేశాల్లో..ఇన్ని భాషల్లో ఓ తెలుగు సిరీస్ రిలీజ్ కావడం ఇదే తొలిసారి కావొచ్చు. ఇప్పటివరకూ టాలీవుడ్ నుంచి కూడా చాలా వెబ్ సిరీస్ లు రూపొందాయి. కానీ ఈ రేంజ్ లో ఏ సిరీస్ మార్క్ ట్ లోకి రాలేదు. బాలీవుడ్ వెబ్ సిరీస్ లకు దీటుగా దీన్ని రిలీజ్ చేసారు.
నాగ చైతన్యలో కొత్త నటుడ్ని పరిచయం చేసిన సిరీస్ ఇది అనొచ్చు. ఇంతవరకూ చైతన్య ఇలాంటి పాత్రలో ఏ సినిమాలో పోషించలేదు. ఆయన పూర్తిగా ఇమేజ్ చట్రం నుంచి బయటకు వచ్చి చేసిన వెబ్ సిరీస్ ఇది. కేవలం విక్రమ్. కె. కుమార్ పై నమ్మకంతోనే ధైర్యంగా రంగంలోకి దిగాడు. ఈ సిరీస్ చూసిన తర్వాత నాగార్జున కూడా థ్రిల్ ఫీలయ్యారు. ఇందులో నటించింది చైతన్యేనా? అంటూ ఆయన సందేహం వ్యక్తం చేసారు.