Begin typing your search above and press return to search.

100 కోట్లు పెడితే.. సగం కూడా రాలేవా??

ఏఆర్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో తెరకెక్కింది. ఈ సినిమాకి యాక్షన్ కింగ్ అర్జున్ కథ అందించారు

By:  Tupaki Desk   |   20 Oct 2024 8:30 PM GMT
100 కోట్లు పెడితే.. సగం కూడా రాలేవా??
X

యాక్షన్ కింగ్ అర్జున్ దగ్గరి బంధువు ధృవ్ సర్జాకి కన్నడనాట మంచి మాస్ ఇమేజ్ ఉంది. ఎక్కువ మాస్ యాక్షన్ కథలతోనే ధృవ్ సర్జా మూవీ చేస్తూ ఉంటాడు. ధృవ్ సర్జా రీసెంట్ గా ‘మార్టిన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాని ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఏఆర్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో తెరకెక్కింది. ఈ సినిమాకి యాక్షన్ కింగ్ అర్జున్ కథ అందించారు.

పవర్ ఫుల్ ఎలివేషన్ సీక్వెన్స్ లతో నెవ్వర్ బిఫోర్ అనే స్థాయి యాక్షన్ సన్నివేశాలతో ‘మార్టిన్’ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. అయితే ఈ మూవీకి మొదటి రోజే డివైడ్ టాక్ వచ్చింది. ఓవరాల్ గా మొదటి వారంలో అన్ని భాషలలో కలిపి ఈ మూవీ 23 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. 13 భాషలలో రిలీజ్ చేసిన కూడా కన్నడనాట మంచి వసూళ్లని సాధించింది. అయితే హిందీ, తమిళ్, మలయాళీ భాషలలో ఈ సినిమాకి ఎలాంటి కలెక్షన్స్ రాలేదని తెలుస్తోంది.

మొదటి వారంలో కొంత మెరుగైన కలెక్షన్స్ అందుకున్న కూడా రెండో వారంలో కంప్లీట్ గా ‘మార్టిన్’ వసూళ్లు డ్రాప్ అయిపోయాంట. శనివారం ఈ సినిమాకి అత్యల్ప కలెక్షన్స్ వచ్చాయని సమాచారం. బెంగాలీ, అరబిక్, జపనీస్, చైనీస్, రష్యన్ మరియు స్పానిష్ వంటి వివిధ భాషలలో విడుదలైనప్పటికి కూడా ఎక్కడా ఈ సినిమాకి ఆదరణ లభించలేదని ట్రేడ్ వర్గాలలో వినిపిస్తోంది. ఇక హిందీలో అలియా భట్ ‘జిగ్రా’, రాజ్ కుమార్ రావు ‘విక్కీ విద్యా కా వో వాలా’ సినిమాలు ‘మార్టిన్’ కి పోటీగా రిలీజ్ అయ్యాయి.

హిందీ ఆడియన్స్ పూర్తిగా ఆ సినిమాల పైన శ్రద్ధ పెట్టారు. దీంతో ‘మార్టిన్’ నార్త్ ఇండియాలో పెద్దగా ప్రభావం చూపించలేదు. ఓవరాల్ గా ఈ సినిమా నిర్మాతకి భారీ నష్టాలని అందించిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. కథ, కథనం, విజువలైజేషన్ లలో ఏ ఒక్కటి ఆడియన్స్ ని మెప్పించలేదని చెబుతున్నారు. ఒంటరిగా పాకిస్థాన్ వెళ్లి అక్కడ దేశం కోసం శత్రువులతో పోరాడేవాడిగా ధృవ్ సర్జా క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేశారు.

ఈ సినిమా కోసం అతను భారీ కాయుడుగా తయారయ్యాడు. ఆయన కష్టానికి తగ్గ ఫలితం అయితే సినిమాకి రాలేదు. నెక్స్ట్ ధృవ్ సర్జా శాండిల్ వుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రేమ్ దర్శకత్వంలో ‘కేడీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది కూడా మాస్ యాక్షన్ కథాంశంతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.