ధృవ నక్షత్రం.. చివరి నిమిషంలో మరో షాక్
గౌతమ్ వాసుదేవ్ అంటే కేవలం తమిళ్ లొనే కాకుండా తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది. ఘర్షణ సూర్యా సన్నాఫ్ కృష్ణన్ సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
By: Tupaki Desk | 24 Nov 2023 5:31 AM GMTగౌతమ్ వాసుదేవ్ అంటే కేవలం తమిళ్ లొనే కాకుండా తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది. ఘర్షణ సూర్యా సన్నాఫ్ కృష్ణన్ సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ నాగచైతన్యకు ఏ మాయ చేసావే సినిమా ద్వారా మొదటి సక్సెస్ ఇచ్చిన దర్శకుని కూడా అతనే. కూల్ లవ్ స్టోరీస్ తోనే కాకుండా సీరియస్ డ్రామా సినిమాలను కూడా చాలా బాగా తెర పైకి తీసుకురాగలడు అని గతంలోనే నిరూపించాడు.
ఇప్పటి యువ దర్శకులకు కూడా అతను ఎంతో ప్రేరణగా నిలిచాడు అని చెప్పవచ్చు. ప్రస్తుతం నటుడిగా అతను సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అదే క్రమంలో గ్యాప్ ఉన్నప్పుడు దర్శకుడిగా కూడా సినిమాలు చేస్తున్నారు. అయితే గౌతమ్ వాసుదేవ్ దర్శకత్వం వహించిన ఒక సినిమా ఐదేళ్ల నుంచి విడుదలకు నోచుకోవాదం లేదు.
విక్రమ్ హీరో గా ధ్రువ నక్షత్రం అనే సినిమాను ఐదేళ్ల క్రితం పూర్తి చేశారు. అయితే ఈ సినిమా పలు ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. మొత్తానికి నవంబర్ 24వ తేదీన విడుదల చేయడానికి అన్ని రకాల సమస్యల నుంచి బయట వచ్చినట్లు చెప్పారు. తనకు సంబంధించిన కొన్ని కారణాల వల్లనే ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుంది అని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.
ఇక ఈరోజు సినిమాను థియేటర్స్ లోకి తీసుకురాలేకపోతున్నందుకు క్షమించాలి అని దర్శకుడు తెల్లవారుజామున సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు. మరో రెండు రోజుల్లో అన్ని సమస్యలను సాల్వ్ చేసుకుని మీ ముందుకు సినిమాను తీసుకు వస్తామని అప్పటివరకు సపోర్ట్ చేస్తారని అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
అంతేకాకుండా థియేటర్లలో ఈ సినిమా మీకు మంచి అనుభూతిని ఇస్తుందని గౌతమ్ నమ్మకంగా తెలియజేశారు. అయితే ఈ విధంగా సినిమా ఎందుకు వాయిదా పడుతోంది అనే విషయంలో చాలా రకాల గాసిప్స్ వచ్చాయి. ఇక సినిమా ప్రమోషన్స్ పై కూడా హీరో విక్రమ్ పెద్దగా ఫోకస్ చేయలేదు. దర్శకుడు గౌతమ్ కు సంబంధించిన ఆర్థిక కారణాల వల్లనే ఈ సినిమా మళ్లీ నిలిపివేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక హీరో విక్రమ్ మొదట సమస్యలు సాల్వ్ చేయాలని అనుకున్నప్పటికి చేయి దాటి పోవడంతో అతను కూడా వెనకడుగు వేశాడు. దాదాపు 5 ఏళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ధృవ నక్షత్రం ఎప్పుడు వస్తుందో చూడాలి.