Begin typing your search above and press return to search.

పెళ్లికి ముందు అల్లు అర్జున్ కి ఎంతమంది గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు?

ఇందులో భాగంగా బన్నీ ఎవరికీ తెలియని తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.

By:  Tupaki Desk   |   15 Nov 2024 3:06 PM GMT
పెళ్లికి ముందు అల్లు అర్జున్ కి ఎంతమంది గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'అన్‌స్టాపబుల్‌ 4' టాక్ షో లేటెస్ట్ ఎపిసోడ్ లో ముఖ్య అతిథిగా సందడి చేశారు. గతంలో 'పుష్ప: ది రైజ్' సమయంలో ఓసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న బన్నీ.. ఇప్పుడు 'పుష్ప 2: ది రూల్' రిలీజ్ కు ముందు ఈ షోకి వచ్చారు. హోస్ట్ నందమూరి బాలకృష్ణ అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో సరదాగా సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా బన్నీ ఎవరికీ తెలియని తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.

అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే "పెళ్లికి ముందు ఎంతమంది గర్ల్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారు? వాళ్లలో ఎంతమంది గురించి మీ ఆవిడకు చెప్పావు?" అని బాలయ్య ప్రశ్నించారు. దీనికి బన్నీ స్పందిస్తూ.. "ఈ షో 100% నా పిల్లలు కూడా చూస్తారు. నేను నా కొడుకుతో చెప్పిన స్టోరీ ఏంటంటే.. 'నా లైఫ్ లో ఫస్ట్ చూసిన అమ్మాయి మీ మమ్మీనే. నేను మీ మమ్మీనే పెళ్ళి చేసుకున్నాను' అని చెప్పాను" అని తెలివిగా బదులిచ్చారు.

"నా కొడుకు 'యానిమల్' మూవీలో రణబీర్ కపూర్. వాళ్ళ డాడీ కోసం ఏమైనా చేస్తాడు కానీ, మమ్మీ విషయంలో తేడా వస్తే మాత్రం డాడీని కూడా వదలడు" అని అల్లు అర్జున్ నవ్వుతూ చెప్పారు. "నేనైతే మా ఆవిడ దగ్గర ఏమీ దాయలేదు. ఎంతమంది.. వాళ్ళ పేర్లు ఏంటనేది ఇప్పుడొద్దు. పెళ్లనేది ఒక రీసెట్ బటన్ అనేది నా ఫీలింగ్. ఆ ఛాన్స్ దక్కినప్పుడు పెళ్లి తర్వాత ఏంటనేదే లెక్క కానీ, పెళ్లికి ముందు ఏంటనేది లెక్క కాదు. రేపు మీలాంటి వాళ్ళు చెప్పకముందే మా ఆవిడకు అన్నీ చెప్పేశాను" అని బన్నీ చెప్పారు. పేర్లు దాచిపెట్టినావా? అని బాలయ్య అడగ్గా.. "నేనేదో చెప్పి మేనేజ్ చేసుకున్నాను. నన్ను వదిలేయండి సార్" అంటూ నవ్వేశారు.

సినీ ఇండస్ట్రీలో హీరోల ఎఫైర్స్ మీద రూమర్లు కామనే కానీ, అల్లు అర్జున్ మీద ఇలాంటి గాసిప్స్ ఎక్కువగా వినిపించలేదనే చెప్పాలి. కెరీర్ ప్రారంభంలో ఒక హీరోయిన్ తో క్లోజ్ గా ఉన్నాడంటూ డేటింగ్ పుకార్లు పుట్టుకొచ్చాయి కానీ, అవి కూడా పెద్దగా వార్తల్లో నిలవలేదు. అయితే తన ఫస్ట్ గర్ల్‌ ఫ్రెండ్ గురించి ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కి వచ్చిన 'ఇండియన్ ఐడల్ సీజన్ 2' సింగింగ్ టాలెంట్ హంట్ షోలో బన్నీ వెల్లడించారు.

శృతి అనే సింగర్ పాట పాడి వినిపించగా.. గెస్టుగా వచ్చిన అల్లు అర్జున్ ఆమెను ప్రశంసించారు. ఈ క్రమంలో "నాకు నీ పేరు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా అదే'' అని అన్నారు. వామ్మో.. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. నా భార్యకు కూడా తెలియని విషయాన్ని చెప్పేశాను" అంటూ బన్నీ నవ్వుతూ చెప్పారు. ఇప్పుడు బాలయ్య టాక్ షోలో పెళ్లికి ముందు తన గర్ల్ ఫ్రెండ్స్ గురించి నేరుగా చెప్పలేదు కానీ, తన భార్యకు మాత్రం అన్నీ తెలుసని అల్లు అర్జున్ చెబుతున్నారు.