కింగ్ ఖాన్‌ని కొట్టేసిన ప్రభాస్- అల్లు అర్జున్
ఈ సంవత్సరం బాక్సాఫీస్ బరిలో సత్తా చాటిన హీరోలుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎక్కువ చర్చ సాగింది.
By: Tupaki Desk | 28 Dec 2024 3:49 PM GMT2024 ముగుస్తోంది. 2025లో అడుగుపెడుతున్నాం. ఈ సమయంలో టాలీవుడ్ స్టార్ల ఘనత గురించి చాలా చర్చ సాగుతోంది. ఈ సంవత్సరం బాక్సాఫీస్ బరిలో సత్తా చాటిన హీరోలుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎక్కువ చర్చ సాగింది. ఈ ఏడాది జూన్ లో వచ్చిన కల్కి 2898 ఎడి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లు వసూలు చేసింది. అయితే ఏడాది చివరిలో విడుదలై అసాధారణ విజయం సాధించిన పుష్ప 2 ఏకంగా 1600 కోట్లు పైగా వసూలు చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు మరోసారి దేశవిదేశాల్లో మార్మోగింది. ఏడాదిని ఘనంగా ఆరంభించిన ప్రభాస్ ని, ఘనమైన ముగింపును ఇచ్చిన అల్లు అర్జున్ ని పొగిడేయని వారు లేరు.
ఆసక్తికరంగా ఈ ఇద్దరు హీరోలు ఒకే ఏడాదిలో సంపాదించినది ఎంత? అంటే... 3000 కోట్లు. కల్కి 2998 ఎడి వసూళ్లు, పుష్ప 2 వసూళ్లను కలిపి చూస్తే దాదాపు 2800 కోట్లుగా నమోదైంది. అదనంగా ప్రభాస్ నటించిన సలార్ గత ఏడాది డిసెంబర్ చివరిలో విడుదలై, సంక్రాంతి 2024 వరకూ వసూళ్లు అదరగొడుతూనే ఉంది. అందువల్ల ఈ ఏడాదిలో ప్రభాస్ వసూళ్లు 1400 కోట్లుగా పరిగణిస్తే , అల్లు అర్జున్ 1600 కోట్లు కలుపుకుని ఓవరాల్ గా 3000 కోట్లను ట్రేడ్ లో లిస్టింగ్ చేస్తున్నారు.
అయితే 2003 లో కింగ్ ఖాన్ షారూఖ్ ఒక్కడే మూడు సినిమాలతో అదరగొట్టాడు. అతడు నటించిన పఠాన్, జవాన్, డంకీ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. జవాన్ 1200 కోట్లు, పఠాన్ 1100 కోట్లు, డంకీ 400కోట్లు వసూలు చేసాయి. ఈ మూడింటిని కలుపుకుంటే 2700 కోట్లు ఒకే ఏడాదిలో వసూలు చేసాడు షారూఖ్. అయితే ప్రభాస్, అల్లు అర్జున్ వసూళ్లను కలుపుకుంటే అంతకుమించి ఒకే ఏడాదిలో నమోదయ్యాయి. ఆసక్తికరంగా 2024లో బాలీవుడ్ మొత్తం వసూళ్లు 2500 కోట్లు కాగా, షారూఖ్ ఒక్కడే 2023లో సాధించిన వసూళ్లు 2700 కోట్లుగా ఉంది. ఇది కింగ్ ఖాన్ అసాధారణ స్టార్ డమ్ ని ఎలివేట్ చేస్తోంది. ప్రభాస్, అల్లు అర్జున్ స్టామినా కింగ్ ఖాన్ కి ఏమాత్రం తక్కువ కాదని ఇటీవల నిరూపణ అవుతోంది. ఒకే ఏడాదిలో ఆ ఇద్దరు హీరోల నుంచి మూడేసి సినిమాల చొప్పన విడుదలైతే ఒక్కొక్కరూ ఏడాదికి 3000 కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని మారిన లెక్కలు, అంచనాలు చెబుతున్నాయి.