రీజనల్ రాజమౌళి కాదు.. రీజనల్ రావిపూడి..!
సంక్రాంతికి రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ కూడా సూపర్ హ్యాపీ ఉన్నారు.
By: Tupaki Desk | 2 Feb 2025 3:44 AM GMTటాలీవుడ్ లో హిట్ మిషన్ లా తయారయ్యాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. తొలి సినిమా పటాస్ నుంచి రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం వరకు అనిల్ రావిపూడి సినిమా అంటే కచ్చితంగా ఫలితం సూపర్ హిట్టే అనేలా చేసుకున్నాడు. తొలి సినిమా నుంచి సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారాడు అనిల్ రావిపూడి. సంక్రాంతికి రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ కూడా సూపర్ హ్యాపీ ఉన్నారు. వాళ్లే సినిమా సక్సెస్ అయిన సందర్భంగా గ్రాటిట్యూడ్ మీట్ ని ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఒక మీడియా ప్రతినిధి అనిల్ రావిపూడిని రీజనల్ రాజమౌళి అని అన్నాడు. ఐతే దానికి అనిల్ రావిపూడి రాజమౌళి గారితో తనని పోల్చవద్దని.. ఆయన చాలా గొప్ప దర్శకుడని అన్నారు. మీరు కావాలంటే రీజనల్ రాజమౌళి అని పిలవండి అని అన్నాడు. రీజనల్ సినిమాతో 300 కోట్లు కొట్టిన అనిల్ రావిపూడి ఈ సినిమాతో తన కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు.
ఆడియన్స్ పల్స్ పట్టేసిన అనిల్ రావిపూడి పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు తన మార్క్ చూపిస్తూ వచ్చాడు. అనిల్ సినిమా అయితే ఫ్యామిలీ అంతా వెళ్లి ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు అనే భావన తెచ్చాడు. అందుకే అనీల్ సినిమాలకు అంత డిమాండ్ ఏర్పడింది. తన కెరీర్ లో తీసిన 8 సినిమాలు సక్సెస్ అందుకుని రాజమౌళి తర్వాత ఓటమి ఎరగని డైరెక్టర్ గా అనిల్ రావిపూడి సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వస్తునాడు.
అనిల్ తో సినిమా 100 పర్సెంట్ సేఫ్ అనే భరోసా వచ్చింది. రీజనల్ మూవీ తో 300 కోట్లు అనేది మామూలు విషయం కాదు. సో అనిల్ రాబోతున్న సినిమాలకు మరింత క్రేజ్ ఏర్పడుతుంది. అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నాడు. ఆ సినిమా కూడా తన మార్క్ ఎంటర్టైనర్ గా వస్తుందని అది కూడా నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ ఉంటుందని అంటున్నారు. వెంకటేష్ తోనే 300 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాతో ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి. మెగాస్టార్ లోని ఎనర్జీని ఫుల్లుగా వాడేసుకుంటా అని ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు అనిల్ రావిపూడి.