బాలయ్య రియల్ స్టంట్స్ పిచ్చెక్కించేలా!
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో బాలయ్యకు మరో మాస్ హిట్ పక్కా అనే టాక్ బలంగా వినిపిస్తుంది.
By: Tupaki Desk | 26 Dec 2024 10:27 AM GMTగాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో తెరకెక్కిన `డాకు మాహారాజ్` భారీ అంచనాల మధ్య సక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో బాలయ్యకు మరో మాస్ హిట్ పక్కా అనే టాక్ బలంగా వినిపిస్తుంది. అటు ప్రచారం పనులు వేగంగా జరుగు తున్నాయి. యూనిట్ అంతా వివిధ మీడియా సంస్థలతో ఇంటరాక్ట్ అవుతుంది.
దీనిలో భాగంగా తాజాగా బాబి ఓసీక్రెట్ లీక్ చేసారు. ఈసినిమాలో బాలయ్య ఎలాంటి డూప్ లేకుండా నటించినట్లు వెల్లడించారు. ఒక్క సన్నివేశంలో కూడా డూప్ సహాయం తీసుకోలేదుట. ఎంత కష్టమైనా సరే ఆ సన్నివేశాన్ని బాలయ్య ఎంతో ఎపెర్ట్ తో పని చేసారన్నారు. సినిమాలో కథని బాలయ్య ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని రాయడంతో? ఆయన కూడా సెట్స్ లో ఎక్కడా రాజీ పడలేదన్నారు. బాలయ్య పెర్పార్మెన్స్ తో సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్లింద న్నారు.
ఆయన దర్శకుల హీరో అని మరోసారి తన సినిమాతో రుజువైందని` అన్నారు. సాధారణంగా సినిమాలంటే యాక్షన్ సన్నివేశాల కోసం స్టంట్ మాస్టర్లు డూప్ యాక్టర్లను రంగంలోకి దించుతారు. సినిమాలో ఏవైనా ఫైర్ సన్నివే శాలున్నా.. రిస్కీ షాట్లు ఉన్నా డూప్ తప్పనిసరి. కానీ `డాకు మహారాజ్` లో బాలయ్య ఆ ఛాన్స్ ఎవరికీ ఇవ్వనట్లు తెలుస్తుంది. ఎలాంటి డూప్ లేకుండా? రియలిస్టిక్ పెర్పార్మెన్స్ ఇచ్చారు.
సినిమాలో ఆ సన్నివేశాలు ప్రత్యకంగా హైలైట్ అయ్యే అవకాశం ఉంది. బాబి సినిమాలంటే యాక్షన్ సన్నివేశాలు భారీగానే ఉంటాయి. పైగా బాలయ్య తో సినిమా అంటే యాక్షన్ పీక్స్ లో ఉంటుంది. ఈసారి బోయపాటిని మించి యాక్షన్ సన్నివేశాలు డాకు మహారాజ్ లో ఉన్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. మరి బాలయ్య ఏ రేంజ్ లో పెర్పార్మెన్స్ ఇచ్చారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.