Begin typing your search above and press return to search.

కాస్త జాగ్రత్త పడితే అమ్మడి రేంజ్ వేరే లెవెల్ అంతే..!

తెలుగులో స్టార్ రేంజ్ అందుకుంటే ఆ లెక్క ఏంటన్నది ముందే తెలుసుకుని వచ్చిన భాగ్య శ్రీ మిస్టర్ బచ్చన్ కోసం మాక్సిమం గ్లామర్ షో చేసింది.

By:  Tupaki Desk   |   29 Aug 2024 5:51 AM GMT
కాస్త జాగ్రత్త పడితే అమ్మడి రేంజ్ వేరే లెవెల్ అంతే..!
X

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి స్టార్ క్రేజ్ వస్తుందా అంటే చెప్పడం కష్టం. కొందరికి టాలెంట్ తో పాటు లక్ కలిసి వస్తే మొదటి రెండు సినిమాల్లోనే స్టార్ క్రేజ్ తెచ్చుకుంటారు కానీ కొంతమంది హీరోయిన్స్ చిన్నగా తమ టాలెంట్ చూపిస్తూ స్టార్ రేంజ్ దక్కించుకుంటారు. ఐతే తొలి సినిమాతోనే ఆడియన్స్ లో ఐడెంటిటీ తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో మిస్టర్ బచ్చన్ భామ భాగ్య శ్రీ బోర్స్ కూడా వస్తుంది. హరీష్ శంకర్ కొత్త హీరోయిన్ ని తీసుకొస్తున్నాడు అంటే ఏదో అందరిలానే ఆమె కూడా అనుకున్నారు కానీ మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగ్య శ్రీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

సినిమా ఆమె కోసమైనా చూసేయాలి అనేలా చేశాడు హరీష్ శంకర్. తెలుగులో స్టార్ రేంజ్ అందుకుంటే ఆ లెక్క ఏంటన్నది ముందే తెలుసుకుని వచ్చిన భాగ్య శ్రీ మిస్టర్ బచ్చన్ కోసం మాక్సిమం గ్లామర్ షో చేసింది. ఐతే అది ఆ సినిమాకు ఎంతవరకు హెల్ప్ అయ్యిందో చెప్పడం కష్టం కానీ భాగ్య శ్రీకి మాత్రం బాగానే కలిసి వచ్చిందని చెప్పొచ్చు. మిస్టర్ బచ్చన్ రిలీజ్ కు ముందే విజయ్ దేవరకొండ సినిమా ఆఫర్ అందుకున్న భాగ్య శ్రీ ఆ సినిమాతో హిట్ కొడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుంది.

విజయ్ సినిమా సెట్స్ మీద ఉండగానే రానా నిర్మాణంలో దుల్కర్ చేస్తున్న కాంత సినిమాలో కూడా భాగ్య శ్రీని హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తుంది. సో ఇలా వరుస క్రేజీ ఛాన్స్ లు అందుకుంటున్న అమ్మడు అందులో ఒక్క సూపర్ హిట్ పడినా టాలీవుడ్ లో మరో స్టార్ హీరోయిన్ పుట్టుకొచ్చినట్టే అని చెప్పొచ్చు. భాగ్య శ్రీ అటు గ్లామర్ పరంగా నో లిమిట్స్ అనేస్తుంది కాబట్టి ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఐతే అమ్మడు ఎంతసేపటికీ గ్లామర్ తో కాకుండా మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలు కూడా చేస్తే కచ్చితంగా తెలుగులో కొన్నాళ్లు మంచి కెరీర్ కొనసాగించే ఛాన్స్ ఉంటుంది. భాగ్య శ్రీ నుంచి రాబోతున్న రెండు సినిమాలు అమ్మడి టాలీవుడ్ కెరీర్ ని డిసైడ్ చేస్తాయని చెప్పొచ్చు. భాగ్య శ్రీ అందాలకు మాత్రం తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.